కుమారుడి వైద్య ఖర్చుల కోసం భూమిని విక్రయించిన వృద్ధుడి నుంచి ఓ కోతి డబ్బు లాక్కెళ్లి గంటసేపు హంగామా సృష్టించిన ఉదంతమిది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఖైరాబాద్‌కు చెందిన భగవాన్‌దీన్.. తాను విక్రయించిన భూమిని కొనుగోలుదారుడి పేరు మీదకు మార్పించేందుకు సీతాపుర్‌లోని రిజిస్టార్ కార్యాలయానికి బుధవారం వచ్చారు. రిజిస్ట్రేషన్ పని పూర్తయ్యాక కొనుగోలుదారు ఆయనకు రూ.4 లక్షలు ముట్టజెప్పారు. కార్యాలయ ప్రాంగణంలోని ఓ చెట్టు కింద కూర్చొని భగవాన్‌దీన్ వాటిని లెక్కపెట్టుకుండగా.. ఒక్కసారిగా ఓ వానరం రూ.500 నోట్లున్న కట్టను లాక్కొని చెట్టెక్కేసింది. అందులో నుంచి కొన్ని నోట్లను తీసి కిందకు విసరడం ప్రారంభించింది.
-
Monkey showers Rs 500 currency notes from a tree outside the registry office in UP's Sitapur. The monkey had snatched a bundle of currency notes from a person who had come to register a property. @Benarasiyaa pic.twitter.com/o6AwrAEilT
— Kanwardeep singh (@KanwardeepsTOI) December 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Monkey showers Rs 500 currency notes from a tree outside the registry office in UP's Sitapur. The monkey had snatched a bundle of currency notes from a person who had come to register a property. @Benarasiyaa pic.twitter.com/o6AwrAEilT
— Kanwardeep singh (@KanwardeepsTOI) December 23, 2020Monkey showers Rs 500 currency notes from a tree outside the registry office in UP's Sitapur. The monkey had snatched a bundle of currency notes from a person who had come to register a property. @Benarasiyaa pic.twitter.com/o6AwrAEilT
— Kanwardeep singh (@KanwardeepsTOI) December 23, 2020
ఎట్టకేలకు..
భగవాన్‌దీన్ తీవ్ర ఆందోళనతో అరుస్తుండగా, అక్కడ జనం గుమిగూడారు. పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఆశ చూపిస్తూ వానరం నుంచి డబ్బు రాబట్టేందుకు ప్రయత్నించారు. దాదాపు గంట తర్వాత ఎట్టకేలకు నోట్ల కట్టను కోతి కిందకు విసరడంతో భగవాన్‌దీన్ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే రూ.7 వేల విలువైన నోట్లు చిరిగిపోయాయి. తన కుమారుడికి వైద్య చికిత్స చేయించేందుకుగాను భూమిని విక్రయించినట్లు భగవాన్‌దీన్ తెలిపారు.