ETV Bharat / bharat

Narendra Giri: మహంత్​ ఆత్మహత్య కేసు సీబీఐకి బదిలీ!

నరేంద్ర గిరి ఆత్మహత్య కేసు (Narendra Giri) దర్యాప్తు సీబీఐ చేపట్టాలని యూపీ ప్రభుత్వం సిఫార్స్​ చేసింది. మరోవైపు ఈ కేసులో నిందితుడుగా ఉన్న ఆనంద్​ గిరిని యువ భారత్​ సంధు సమాజ్​ అధ్యక్షునిగా ఆ సంస్థ తొలగించింది.

narendra giri daeth
నరేంద్ర గిరి ఆత్మహత్య కేసు
author img

By

Published : Sep 23, 2021, 12:46 PM IST

మహంత్​ నరేంద్ర గిరి (Narendra Giri) ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి సిఫార్సు చేసింది యూపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్​ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పోస్ట్​మార్టం (mahant death) ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఆనంద్​ గిరిపై చర్యలు..

నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన శిష్యుడు ఆనంద్​ గిరిపై (anand giri) భారత్​ సంధు సమాజ్​ చర్యలు చేపట్టింది. యువ భారత్​ సంధు సమాజ్​ అధ్యక్ష పదవి నుంచి ఆనంద్​ గిరిని తొలగించింది. ఈ విషయాన్ని భారత్​ సంధు సమాజ్​ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆనంద్​ గిరి తొలగింపుపై తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని యువ భారత్​ సంధు సమాజ్​ సభ్యులు పేర్కొన్నారు. నరేంద్ర గిరి రాసిన లేఖలో ఆనంద్​ గిరి ప్రస్తావన రావడంపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు.

అఖిల భారతీయ అఖాడా పరిషద్​ అధ్యక్షుడైన మహంత్​ నరేంద్ర గిరి సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆయన మరణం ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు.. ఘటనాస్థలం నుంచి సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్​ గిరి తనను మానసికంగా వేధించాడని నరేంద్ర గిరిలో లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆనంద్​ గిరి సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే.. ఈ ఆత్మహత్య లేఖ నరేంద్ర గిరి రాసింది కాదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మహంత్​ నిర్ణయాలను వ్యతికేరించే వాళ్లే హత్యకు పాల్పడి ఉంటారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : నరేంద్ర గిరి మరణానికి ఆ ఫొటోనే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.