బిహార్‌లో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. అత్యాచారం అనంతరం బాధితురాల్ని ఓ మహిళా మధ్యవర్తికి రూ.50,000కు అమ్మేశారు. సోనీదేవీ, నైట్గార్డ్ అర్జున్ యాదవ్, ఎలక్ట్రీషియన్ సజన్‌కుమార్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మౌ అని పోలీసులు తెలిపారు.
కుటుంబ కలహాల కారణంగా బాధితురాలు ఇంటి నుంచి నెల రోజుల క్రితం బిహార్‌లోని మధుబనికి వెళ్లిపోయింది. సెక్యూరిటీ గార్డు అర్జున్ యాదవ్‌ను సహాయం చేయమని కోరింది. దీంతో అతడు బాధితురాల్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులు ముగ్గురితో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాల్ని ఓ మహిళ మధ్యవర్తికి రూ.50వేలకు అమ్మేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మౌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చికిత్స పొందుతూ మృతి..
దిల్లీలో కొద్ది రోజుల క్రితం 12 ఏళ్ల బాలుడిపై నలుగురు యువకులు అసహజ శృంగారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో బాధితుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
ఇదీ జరిగింది.. 12 ఏళ్ల బాలుడిని నలుగురు వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈశాన్య దిల్లీలో సెప్టెంబరు 18న జరిగిన ఈ ఘటన జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. అత్యాచారం అనంతరం.. బాలుడిపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. బాధితుడి ప్రైవేట్ భాగాలను గాయపరిచారు. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బాలుడు శనివారం మరణించాడు.
ఉద్యోగం ఇప్పిస్తానని..
ఉత్తర్‌ప్రదేశ్ లలిత్‌పుర్‌లో దారుణం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. బాధితులు ఒంటరిగా ఉంటోంది. ఏడాది క్రితం రాజేశ్ లాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థినిని లైంగికంగా..
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ ఉపాధ్యాయుడికి ఆమె తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో జరిగింది. చన్నగిరి గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తరచూ ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించేవాడు. దీంతో భరించలేక బాలిక కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయుడు తనను వేదిస్తున్నాడని తెలిపింది. ఆ కీచక గురువుకి పాఠశాలలోనే బాలిక బంధువులు బుద్ధి చెప్పి పోలీసులకు అప్పగించారు. ఘటనపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుడు లోకేశ్‌ను విధుల నుంచి తొలగించారు.
ఇవీ చదవండి: ఇకపై ఆ సర్టిఫికెట్ లేకపోతే నో పెట్రోల్, డీజిల్!
పాదరక్షల్లో రూ.5కోట్ల కొకైన్.. ఎయిర్‌పోర్ట్‌లో అడ్డంగా బుక్కై..