ETV Bharat / bharat

'ఎలాంటి సంక్షోభమైనా భారత్​ దీటుగా ఎదుర్కొంటుంది' - up election news

UP Election 2022: ప్రపంచం ప్రస్తుతం సంక్షోభ కాలంలో ఉందని, ఎలాంటి క్లిష్టపరిస్థితి ఎదురైనా భారత్ ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పారు ప్రధాని మోదీ. ఈ మేరకు యూపీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.

UP Election 2022
మోదీ
author img

By

Published : Mar 4, 2022, 7:14 PM IST

UP Election 2022: ప్రపంచం సంక్షోభ కాలంలో ఉందని అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ. కరోనా, రష్యా- ఉక్రెయిన్​ మధ్య యుద్ధాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. ఎలాంటి క్లిష్టపరిస్థితి ఎదురైనా భారత్ ఎదుర్కొంటుందని చెప్పారు. ఆపరేషన్ గంగా ద్వారా వేలాది మంది భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ మేరకు యూపీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు.

"ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత్ వాటిని ధీటుగా ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్నవారిని తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్నవారిని 'వందే భారత్​' కార్యక్రమంతో స్వదేశానికి తీసుకువచ్చాం. అఫ్గానిస్థాన్ సంక్షోభ సమయంలో 'దేవీ భారత్​' పేరుతో తరలింపు ప్రక్రియ చేపట్టాం. కరోనా పరిస్థితుల్లో అన్ని దేశాలు చేతులెత్తేశాయి. కానీ పేదల కోసం భారత్.. రూ. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించింది. రూ.30 వేల కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో జమచేశాం. రూ.1.25 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో వేశాం."

-ప్రధాని నరేంద్ర మోదీ

అది వారి డిక్షనరీలోనే లేదు..

యూపీలో కుటుంబ పార్టీలను, మాఫియావాదీలను ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ. భాజపాను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో దేశభక్తితో కూడిన ప్రభుత్వం కావాలని అన్నారు. 'ప్రతిపక్షాలు యూపీని దోచుకున్నాయి. మాఫియాను, క్రిమినల్స్​ను పెంచి పోషించారు. అధికారం కోసం సమాజాన్ని, ప్రజలను విభజించారు. కుటుంబ పాలకులకు పేదల కోసం పనిచేసే సమయంలేదు. కష్టించి పనిచేయడమన్నదే వారి డిక్షనరీలో లేదు. యూపీని, దేశాన్ని బలంగా మార్చే పార్టీకే మీరు ఓటు వేయండి. ఇక్కడ మోదీ.. యోగీ ఉన్నారు.. కేటాయించిన ప్రతి పైసా లబ్ధిదారులకు చేరాల్సిందే.'అని మోదీ మాట్లాడారు.

ఇదీ చదవండి: 'ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని దౌత్యమార్గం ద్వారా పరిష్కరించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.