ETV Bharat / bharat

ఎన్నికల వేళ.. పోలీసులపై గూండాల దాడి- బస్సు ధ్వంసం - యూపీ ఎన్నికలు

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల వేళ దారుణం జరిగింది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

UP Election 2022
attack on police
author img

By

Published : Mar 1, 2022, 5:22 PM IST

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల విధుల్లో ఉన్న మహారాష్ట్ర పోలీసులపై రాళ్ల దాడి చేశారు దుండగులు. లాఠీలతోనూ వారిపై విరుచుకుపడ్డారు. దీంతో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో వారు ప్రయాణిస్తున్న బస్సు కూడా ధ్వంసమైంది

ఇదీ జరిగింది..

ఈ ఘటన తాడ్వాయి పోలీసు స్టేషన్​ పరిధిలో జరిగింది. ప్రయాగ్​రాజ్​లోని బలరామ్​పుర్​ నుంచి బస్సు థాన్​పుర్​ గ్రామానికి చేరుకునేటప్పటికే.. నడిరోడ్డుపై గూండాలు బైఠాయించారు. డ్రైవర్​ హారన్​ కొట్టినప్పటికీ పక్కకు తప్పుకోలేదు. దీంతో కొందరు పోలీసులు కిందకు దిగి వారిని తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వాగ్వాదం చోటుచేసుకుంది.

అంతలోనే పరిస్థితి తీవ్రమై.. వాహనంపై రాళ్లు రువ్వారు దుండగులు. మహారాష్ట్ర పోలీసులపై లాఠీలు ఝళిపించారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని ప్రశ్నిస్తున్నారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి: 'కొందరు నా చావు కోరుతున్నారు.. అది సంతోషమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.