ETV Bharat / bharat

పోలింగ్​కు గంటల ముందు ఆప్  అభ్యర్థి ఎస్పీలోకి..

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో మరికొన్ని గంటల్లో తొలిదశ పోలింగ్ ప్రారంభం కానుండగా ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముజఫర్​నగర్​ ఛర్తావాల్ నియోజకవర్గం ఆప్ అభ్యర్థి యవర్ రోషన్.. సమాజ్​వాదీ(ఎస్పీ) పార్టీలో చేరారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు రోషన్​.

AAP
ఆప్
author img

By

Published : Feb 9, 2022, 10:53 PM IST

UP Election 2022: యూపీలో మరికొన్ని గంటల్లో మొదటి దశ పోలింగ్ ప్రారంభకానున్న క్రమంలో ఆ రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఛర్తావాల్ నియోజకవర్గం ఆప్ అభ్యర్థి యవర్ రోషన్.. సమాజ్​వాదీ(ఎస్పీ) పార్టీలో చేరారు. తన మద్దతు ఛర్తావాల్ నియోజకవర్గం ఎస్పీ అభ్యర్థి పంకజ్ మాలిక్​కు ఉంటుందని తెలిపారు.

ఈ మేరకు ఆమ్​ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​ అవుతోంది.

అయితే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నందుకు రోషన్​ను పార్టీనుంచి బహిష్కరించింది ఆప్​. ఈ మేరకు ముజఫర్​నగర్ జిల్లా ఆప్ జనరల్ సెక్రటరీ తసావర్ హుస్సేన్ ప్రెస్​నోట్​ను విడుదల చేశారు.

ఇదీ చూడండి: తొలిదశ పోలింగ్​కు 'యూపీ' సిద్ధం- ఆ వర్గం తీర్పే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.