ETV Bharat / bharat

'కొందరు నా చావు కోరుతున్నారు.. అది సంతోషమే' - ప్రధాని మోదీ న్యూస్​

UP Election 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. సమాజ్​వాదీ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, చివరికి తన చావును కూడా కోరుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. అయితే ఆ విషయంలో తాను ఆనందంగా ఉన్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

UP Election 2022 PM
UP Election 2022 PM
author img

By

Published : Feb 27, 2022, 9:53 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, చివరికి తన చావును సైతం కోరుకుంటున్నారంటూ విమర్శించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ గతేడాది ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలనుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతేడాది ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. ఈ పర్యటన గురించి అఖిలేశ్‌ యాదవ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. "మంచిదే. ఒకరోజు కాదు.. మూడు నెలలైనా వారణాసిలో ఉండొచ్చు. అలా ఉండడానికి పూర్తి అనువైన ప్రదేశం. ఎందుకంటే చివరి రోజుల్లో అందరూ వారణాసిలోనే గడపాలని కోరుకుంటారు" అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లోనే దుమారం రేగడంతో అఖిలేశ్‌ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భాజపాకు రోజులు దగ్గర పడ్డాయన్న ఉద్దేశంలో తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు.

తాజాగా ఆ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించారు. చివరి రెండు దశల ఎన్నికల ప్రచారంలో భాగంగా వారణాసిలో ఆదివారం పర్యటించిన ఆయన.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. "కొందరు నేతలు పూర్తిగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఏకంగా నా చావును కూడా కోరుతున్నారు. అదీ వారణాసిలోనే కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో నేను ఆనందంగా ఉన్నా. వారణాసి ప్రజలతో చివరి వరకు జీవించే అవకాశం దక్కుతున్నందుకు, ప్రాణం పోయే వరకు వారికి సేవ చేసుకునే భాగ్యం దక్కుతున్నందుకు ఆనందంగా ఉంది" అని మోదీ పేర్కొన్నారు. యూపీలో మార్చి 3, మార్చి 7 తేదీల్లో చివరి రెండు విడత ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న యూపీతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: ఏనుగుపై సవారీ.. రాష్ట్రపతి ఫుల్​ ఖుష్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.