ETV Bharat / bharat

'అమావాస్య టైమ్​లోనే నేరాలు ఎక్కువ.. జాగ్రత్తగా ఉండండి'.. పోలీసులకు హిందూ పంచాంగం పంపిన DGP - Hindu Panchang up dgp police

UP DGP Vijay Kumar Sent Hindu Panchang : హిందూ పంచాంగం సహాయంతో నేరాలను నియంత్రించేందుకు ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు యూపీ డీజీపీ విజయ్​కుమార్​.. పోలీస్​ ఉన్నతాధికారులకు హిందూ పంచాంగాలను పంపించారు. అమావాస్య (కృష్ణ పక్షం)కు ఒక వారం ముందు.. ఒక వారం తర్వాత ముమ్మరంగా పెట్రోలింగ్​ చేపట్టాలని ఆదేశించారు.

dgp sent panchang to police
dgp sent panchang to police
author img

By

Published : Aug 21, 2023, 9:20 AM IST

Updated : Aug 21, 2023, 10:02 AM IST

UP DGP Vijay Kumar Sent Hindu Panchang : ఉత్తర్​ప్రదేశ్​లో నేరాలను అరికట్టేందుకు ఆ రాష్ట్ర పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా డీజీపీ విజయ్​కుమార్​.. పోలీస్​ ఉన్నతాధికారులకు సుదీర్ఘ లేఖను పంపారు. అందులో హత్య, దోపిడీ, దొంగతనం వంటి ఘటనలను అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి సమయంలో జరిగే నేరాలను నియంత్రించాలని కోరారు. లేఖతోపాటు హిందూ పంచాంగాన్ని కూడా పంపారు. హిందూ పంచాంగం సహాయంతో.. అమావాస్యకు ఒక వారం ముందు.. ఒక వారం తర్వాత జరిగే నేరాలను అరికట్టడానికి పెట్రోలింగ్ చేపట్టాలని ఆదేశించారు.

UP DGP Vijay Kumar sent Hindu Panchang to control crime
డీజీపీ పంపిన లేఖ

అమావాస్యకు ఒక వారం ముందు.. ఒక వారం తర్వాత
DGP Sent Hindu Pachangam : రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో జరిగిన ఘటనలను విశ్లేషించిన తర్వాత ఈ లేఖ రాసినట్లు డీజీపీ విజయ్​కుమార్​ తెలిపారు. హిందూ పంచాంగంలోని అమావాస్య (కృష్ణ పక్షం)కు ఒక వారం ముందు.. ఒక వారం తర్వాత నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించినట్లు ఆయన వివరించారు. అందుకే ఈ విషయాన్ని గుర్తుంచుకుని నేరాలను అరికట్టడానికి కృషి చేయాలని ఆదేశించారు.

డీజీపీ పంపిన హిందూ పంచాంగం

అమావాస్య తిథుల్లో మరింత అప్రమత్తంగా..
Amavasya In September 2023 : హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల అమావాస్య తేదీని గుర్తించాలని డీజీపీ విజయ్​కుమార్​ ఆదేశాలు జారీ చేశారు. ఉదాహరణకు ఆగస్టు నెలలో 16వ తేదీ, సెప్టెంబర్‌లో 14వ తేదీ, అక్టోబర్‌లో 14వ తేదీల్లో అమావాస్య తిథి.. కాబట్టి ఈ తేదీల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆ డేటా సేకరించి..
Hindu Panchang For Police : క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్​వర్క్ సిస్టమ్స్ (CCTNS), డయిల్ 112 నుంచి పోలీసులు.. డేటాను సేకరించాలని తెలిపారు. వాటి ఆధారంగా హాట్‌స్పాట్‌లను గుర్తించి నేరాలను అరికట్టడానికి ప్రయత్నించాలని ఆదేశించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రతి నెల అమావాస్యకు ఒక వారం మందు, ఒక వారం తర్వాత ముమ్మరంగా పెట్రోలింగ్​ చేయాలని తెలిపారు. నేరాలను అరికట్టేందుకు ఎస్‌ఓపీని సిద్ధం చేయాలని, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Last Updated : Aug 21, 2023, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.