ETV Bharat / bharat

'యూపీ ఎన్నికల్లో భాజపాకు 300ప్లస్ ఖాయం' - యూపీ ఎన్నికలు 2022 భాజపా

ఉత్తర్​ప్రదేశ్​లో రాబోయే శాసనసభ ఎన్నికల్లో భాజపా చారిత్రక విజయం సాధిస్తుందన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్​ ప్రసాద్ మౌర్య. ఈసారి కూడా 300కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పారు.

up assembly polls 2022
యూపీ 2022 అసెంబ్లీ ఎన్నికలు
author img

By

Published : Jun 1, 2021, 7:23 PM IST

2022 ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్​ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా 300 పైచిలుకు స్థానాల్లో పాగా వేస్తామన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో పార్టీ సన్నద్ధతపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్​ సంతోష్​తో మంగళవారం ఆయన భేటీ అయ్యారు.

"2022లో యూపీలో చారిత్రక విజయం సాధిస్తాం. ఈసారి కూడా 300 స్థానాలకుపైగా గెలుస్తాం. ఈ క్రమంలోనే ప్రజల్లోకి కార్యకర్తలు చేరువయ్యే అంశంపై సమావేశంలో చర్చించాం."

- కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ ఉప ముఖ్యమంత్రి

కొవిడ్​ వేళ పార్టీ చేపడుతోన్న సహాయక చర్యలు సహా సంస్థాగత వ్యవహారాలపై సమీక్షించేందుకు కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్​ సింగ్​తో పాటు బీఎల్​ సంతోష్..​ రాష్ట్రంలోని పార్టీ సీనియర్​ నేతలతో సమావేశాలు చేపట్టారు.

ఇదీ చూడండి: యూపీ ఎన్నికల నిర్వహణపై ఈసీ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.