ETV Bharat / bharat

పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు

author img

By

Published : Jun 8, 2021, 2:01 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​లో విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు.

suicide
ఆత్మహత్య

ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​ జిల్లా కట్రాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా పిల్లలకు ఉరివేసి, తర్వాత దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

ఏం జరిగింది?

షాజహాన్​పుర్, కట్రాకు చెందిన అఖిలేశ్​ గుప్తా(42),రిషు గుప్తా(39) దంపతులు. ఇటీవల అఖిలేశ్​ గుప్తా.. ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తి వద్ద అప్పు చేశాడు. అయితే.. అప్పు తీర్చాల్సిందిగా సదరు వ్యక్తి ఇబ్బంది పెట్టేవాడు. దీంతో ఆర్థిక వేదింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు అఖిలేశ్​ రాసిన సూసైడ్​ నోట్​ ఆధారంగా పోలీసులు వివరించారు. ముందుగా ఇద్దరు పిల్లలు శివాంగ్​(12), హర్షిత(9)లకు ఉరివేసి.. తర్వాత దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ ఎస్​. ఆనంద్ తెలిపారు.

సూసైడ్ నోట్​ ఆధారంగా డబ్బు కోసం.. కుటుంబాన్ని వేధించిన వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు.

ఇదీ చదవండి : కెమికల్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం- 18మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.