ETV Bharat / bharat

ఠాణాలో మద్యం మాయం- ఎలుకలే కారణం! - ఎలుకలే మద్యం మాయం చేశాయని ఉత్తరప్రదేశ్​ పోలీసుల సమాధానం

ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ పోలీస్​ స్టేషన్​లో.. సీజ్​ చేసిన 1452 కార్టన్ల మధ్యం మాయమైంది. ఇందుకు ఆ స్టేషన్​ పోలీసులు ఓ వింత కారణం చెబుతున్నారు. ఎలుకలు ఆ మద్యాన్ని మాయం చేశాయని సమాధానమిస్తున్నారు. ఇలాంటి వింత సమాధానంతో షాక్​ తిన్న ఉన్నతాధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టారు.

cops blame rats for disappearance of seized illicit liquor
ఎలుకలే మద్యం మాయం
author img

By

Published : Mar 31, 2021, 9:56 AM IST

పోలీస్ స్టేషన్​ స్ట్రాంగ్​రూం​ నుంచి 1452 కార్టన్ల మద్యాన్ని ఎలుకలు మాయం చేశాయట! అవును మీరు విన్నది నిజమే. ఉత్తర్​ప్రదేశ్​లోని ఎటా జిల్లా కొత్వాలీ దేహత్​ ​స్టేషన్​ పోలీసులు చెబుతున్న సమాధానం ఇది. ఒకింత నవ్వు తెప్పిస్తున్న ఈ అంశం ఇప్పుడు ఉత్తర్​ప్రదేశ్​లో చర్చనీయాంశంగా మారింది.

ఏం జరిగిందంటే..

వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న 1452 మద్యం కార్టన్లను​ స్టేషన్​ స్ట్రాంగ్​ రూంలో పెట్టారు పోలీసులు. వాటి లెక్కలు చూసే సమయంలో తేడా గమనించిన అధికారులు.. మద్యం మాయమైనట్లు గుర్తించారు. స్టేషన్ అధికారులను ప్రశ్నించగా.. మద్యం ఉన్న ప్లాస్టిక్​ క్యాన్లను ఎలుకులు కొరికి, సీసాలను పగలగొట్టాయని వింత సమాధానమిచ్చారు. అయితే వారు చెబుతున్న సమాధానం ఏ మాత్రం నమ్మశక్యంగా లేదన్న ఉన్నతాధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు.

239 కార్టన్లలో మద్యాన్ని ఎలుకలు నాశనం చేశాయని సంబంధిత స్టేషన్​ డైరీలో పొందుపర్చారు. ఇది నమ్మశక్యం కాని సమాధానం. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చెప్పిన వివరణలా ఉంది.

--జిల్లా పోలీస్ ఉన్నతాధికారి

ఇదీ చదవండి:దిల్లీలో అగ్ని ప్రమాదం- 200 ఇళ్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.