అఫ్గానిస్థాన్‌లోని కాబుల్ నది నుంచి తీసుకొచ్చిన నీటితో అయోధ్య శ్రీరామ జన్మభూమి (Ayodhya Ram Mandir) వద్ద జలాభిషేకం నిర్వహించారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ప్రధాని మోదీ సూచనల మేరకు గంగాజలంతో కలిపి రామ మందిర నిర్మాణ ప్రాంతంలో అభిషేకం చేశారు.
అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ బాలిక ఈ నీటిని ప్రధానికి పంపించారు. కాబుల్ నదీజలంతో శ్రీరామ్ లల్లాకు (Ayodhya Ram Mandir) అభిషేకం చేయాలని మోదీని బాలిక కోరారు. ఈ నేపథ్యంలో ఆదివారం అయోధ్యలో ఈ కార్యక్రమం నిర్వహించారు యోగి. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం జరిగింది.
![UP CM performs 'Jal Abhishek' to Ram Lalla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13510769_asds.png)
"అఫ్గాన్ మహిళలు, యువతులందరికీ నా సానుభూతి ప్రకటిస్తున్నా. భయంతో జీవిస్తున్న బాలికలు, మహిళల మనోవేదనను అఫ్గాన్ బాలిక మనతో పంచుకుంది. ఈ నీటిని రామ్ లల్లాకు సమర్పించే అవకాశం రావడం నా అదృష్టం."
-యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం
అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే మందిర నిర్మాణం (Ayodhya Ram Mandir Construction) పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అంచనా చేశారు. 2023 డిసెంబర్ నాటికి భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని ఇదివరకు తెలిపారు. ఆలయ శంకుస్థాపన మొదటి దశ పనులు (Ram Mandir Construction) సెప్టెంబర్‌లో పూర్తి కాగా.. రెండో దశ పనులు (Ayodhya Ram Mandir Construction) నవంబర్ 15 నాటికి పూర్తి అవుతాయన్నారు. అయోధ్యలో (Ayodhya Ram Mandir Photo) జరుగుతున్న నిర్మాణ పనుల చిత్రాలు వీక్షించేందుకు ఈ కథనంపై క్లిక్ చేయండి..
ఇదీ చదవండి: మెరిసిపోతున్న అయోధ్య.. దీపోత్సవానికి సర్వం సిద్ధం