బోరుబావిలో పడి మరో పసిప్రాణం బలైపోయింది. ఉత్తర్ప్రదేశ్ మహోబా జిల్లా బుదౌరాలో బుధవారం బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీశాయి.
ఆక్సిజన్ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు వైద్యులు.
ఎన్డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం.. బాలుడ్ని రక్షించేందుకు 20 గంటలపాటు తీవ్రంగా శ్రమించాయి.