ETV Bharat / bharat

ఆయనకు 47.. ఆమెకు 26.. ఎస్పీ నేత కూతురితో భాజపా లీడర్​ మాయం - ఉత్తర్​ప్రదేశ్​ భాజపా నేత ఆశిష్ శుక్లా

47 ఏళ్ల భాజపా నేత.. సమాజ్​వాదీ పార్టీ నాయకుడి కూతురిని తీసుకుని పారిపోయారు. ఆమెకు 26 ఏళ్లే కావడం గమనార్హం. ఆ అమ్మాయికి ఇటీవలే పెళ్లి నిశ్చయం అయింది. ఈ నేపథ్యంలనే ఇద్దరు పారిపోయారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

up-bjp-leader-elopes-with-sp-leader-daughter-expelled
ఏస్పీ నేత కూతురితో పారిపోయిన భాజపా లీడర్
author img

By

Published : Jan 18, 2023, 8:39 PM IST

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన 47 ఏళ్ల భాజపా నేత.. సమాజ్​వాదీ పార్టీకి చెందిన ఓ నాయకుడి కూతురి(26)ని తీసుకుని పారిపోయారు. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగింది. రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆశిశ్ శుక్లా అనే భాజపా నాయకుడు.. 26 ఏళ్ల సమాజ్​వాది పార్టీ నేత కూతురితో పారిపోయారు.

వివరాల్లోకి వెళితే..
ఆశిశ్ శుక్లా ప్రస్తుతం హర్దోయ్ నగర భాజపా జనరల్​ సెక్రెటరీగా ఉన్నాడు. ఆయనకు ఇదివరకే పెళ్లైంది. 21 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఏడేళ్ల కూతురు కూడా ఉంది. అయితే సమాజ్​వాదీ పార్టీకి చెందిన నాయకుడి కూతురికి ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. త్వరలో ఆమె పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆశిశ్ శుక్లా ఆ అమ్మాయితో పారిపోయారు. వారిద్దరు ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ విషయం సంచలనంగా మారింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. ఈ వ్యవహారంపై భాజపా హర్దోయ్ జిల్లా మీడియా ఇన్‌చార్జి గంగేశ్ పాఠక్ స్పందించారు. ఆశిష్ శుక్లాను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. "శుక్లా పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డాడు. ఆయన్ను అన్ని పదవుల నుంచి తొలగించాం. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశాం. ఇప్పటి నుంచి అతనికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. శుక్లాపై పూర్తి స్వేచ్ఛతో పోలీసులు విచారణ చేసుకోవచ్చు" అని గంగేశ్ పాఠక్ తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.