అక్రమ నగదు రవాణా కేసులో ఉత్తర్‌ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) ఇద్దరు చైనా జాతీయులను శనివారం అరెస్టు చేసింది. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. వారిద్దరూ నకీలీ ధ్రువపత్రాలను ఉపయోగించి బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు యత్నించారని పోలీసులు ఆరోపించారు. ఈ ఖాతాల ద్వారా డబ్బును నేరపూరిత చర్యల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు.
ఈ చైనీయులను పోచ్నీ టెంగ్లి, జు జున్ఫులుగా గుర్తించారు. నోయిడాలోని గౌతమ్ బుద్ధానగర్‌లో వీరిని అరెస్టు చేశారు. అయితే.. వీరికి అంతకుమందే రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులను అందజేశామని ఏటీఎస్ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాలు లభించగా.. శనివారం వీరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:తూర్పు లద్దాఖ్‌లో చైనా నయవంచన!