UP Assembly Elections 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో భాగంగా 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఫిబ్రవరి 10(గురువారం)న ఓటింగ్ జరగనుంది. 2.27కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
కరోనా వేళ..
కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. 11 జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద 50 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించింది.
జాట్లే అధికం..
తొలిదశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. తొలి దశ ఎన్నికలు జరిగే ఈ జిల్లాల్లోనే రైతులు ఉద్యమాన్ని చేపట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. దీంతో ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.
తొలి దశలో ఎన్నికలు జరిగే 58 అసెంబ్లీ స్థానాల్లో 53 స్థానాలను 2017 ఎన్నికల్లో కైవసం చేసుకుంది భాజపా.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీస్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవీ చూడండి:
'తొలి దశలోనే భాజపాకు కళ్లు, చెవులు తెరుచుకుంటాయి'
35 ఏళ్ల చరిత్రను తిరగరాసేనా? 'మొదటి దశ' తేల్చేసేనా?
'సీఎం అభ్యర్థి యోగినే.. కొందరికి కలలో కృష్ణుడు అందుకే కనిపిస్తున్నాడు'