ETV Bharat / bharat

Cabinet expansion:మంత్రివర్గ విస్తరణలో యూపీ, గుజరాత్‌కే అగ్రాసనం

కేంద్ర మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)లో యూపీ, గుజరాత్​కు అత్యధిక వాటా దక్కింది. 43 మంది కొత్త మంత్రుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఏడుగురు, గుజరాత్‌ నుంచి ఐదుగురు ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా ఏడుగుర్ని తీసుకున్నా ఎవరికీ కేబినెట్‌ హోదా ఇవ్వలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలోని అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

modi new ministry
మంత్రివర్గ విస్తరణలో యూపీ, గుజరాత్‌కే అగ్రాసనం
author img

By

Published : Jul 8, 2021, 7:09 AM IST

కేంద్ర మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌కు అత్యధిక వాటా దక్కింది. ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది మంత్రుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఏడుగురు, గుజరాత్‌ నుంచి ఐదుగురు ఉన్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటకలకు 4 చొప్పున; బిహార్‌కి 3; మధ్యప్రదేశ్‌, ఒడిశాలకు 2 చొప్పున బెర్తులు దక్కాయి. మరో 12 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. కొత్త మంత్రుల్లో శర్వానంద్‌ సోనోవాల్‌, అనుప్రియ పటేల్‌, వీరేంద్రకుమార్‌లు మునుపటి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. జ్యోతిరాదిత్య సింధియాకు ఇదివరకు యూపీయే ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉంది. మిగిలిన వారంతా తొలిసారి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

modi new ministry
కొత్త, పాత మంత్రుల బృందం

సుశీల్‌ మోదీకి లభించని స్థానం

వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా, పంజాబ్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గోవా మినహాయించి మిగిలిన రాష్ట్రాలకు కొత్త కూర్పులో స్థానం ఇచ్చారు. ఆశ్చర్యకరంగా.. బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీకి కొత్త జట్టులో స్థానం లభించలేదు. 2015లో ఏర్పడిన ఆర్‌జేడీ-జేడీయూ కూటమి మధ్య అగ్గి రాజేసి, నీతీశ్‌కుమార్‌ ఆ కూటమిని వదిలి ఎన్డీయేతో జట్టుకట్టేలా చేయడంలో కీలక భూమిక పోషించిన ఆయన్ని 2020లో జరిగిన బిహార్‌ ఎన్నికల తర్వాత మళ్లీ ఉప ముఖ్యమంత్రిని చేస్తారని భావించారు. ఊహించని విధంగా అక్కడ కొత్త నాయకత్వాన్ని తెరమీదికి తెచ్చి, ఆయన్ని రాజ్యసభకు పంపారు. దీంతో సుశీల్‌ను కేంద్ర మంత్రిని చేస్తారని అందరూ ఊహించారు. అలాంటిదేమీ లేకుండా బిహార్‌ నుంచి కొత్తగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మిత్రపక్షాల వారు. మాజీ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుతం విద్యుత్తు శాఖను స్వతంత్ర హోదాలో నిర్వహిస్తున్న ఆర్‌కే సింగ్‌కు మాత్రం పదోన్నతి కల్పించి కేబినెట్‌ హోదా ఇచ్చారు. దీంతో సుశీల్‌కుమార్‌ ఆశలకు గండిపడింది. మధ్యప్రదేశ్‌ ఎస్సీ నేత థావర్‌చంద్‌ గహ్లోత్‌ను మంత్రివర్గం నుంచి తొలగించి కర్ణాటక గవర్నర్‌గా పంపడం వల్ల ఇప్పుడు ఆ రాష్ట్రం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికే చెందిన వీరేంద్రకుమార్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను భాజపా వైపు మళ్లించి, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ కూలిపోయి, భాజపా సర్కార్‌ ఏర్పాటులో కీలకపాత్ర పోషించినందుకు బహుమతిగా జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రివర్గంలో పీటవేశారు.

modi new ministry
ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది అమాత్యులంటే..

యూపీలో అన్ని ప్రాంతాలకూ ప్రాతినిధ్యం

ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా ఏడుగుర్ని తీసుకున్నా ఎవరికీ కేబినెట్‌ హోదా ఇవ్వలేదు. ఇందులో ఆరుగురు భాజపా సభ్యులు కాగా, ఒకరు మిత్రపక్షమైన అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియ పటేల్‌. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు అవకాశం కల్పించారు. ఏడుగురిలో ఒకరు అగ్రవర్ణాలకు చెందినవారు. ఓబీసీ, ఎస్సీల నుంచి చెరో ముగ్గురు ఉన్నారు. కార్మిక మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ రాజీనామా చేయడం వల్ల ఆ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన అనుప్రియ పటేల్‌కు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, మహేంద్రనాథ్‌ పాండే, ముఖ్తార్‌అబ్బాస్‌ నఖ్వీ, సంజీవ్‌ బల్యాన్‌, సాధ్వీ నిరంజన్‌జ్యోతిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయిదుగురు సభ్యులకు అవకాశం ఇచ్చిన గుజరాత్‌లో పటేల్‌, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ రాష్ట్ర శాసనసభకు 2022 డిసెంబరులో ఎన్నికలున్నాయి.

పార్లమెంటు ఎన్నికల కోణంలో ప్రాతినిధ్యం

2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భాజపాకు బలంగా అన్ని రాష్ట్రాలకూ కొత్త మంత్రివర్గంలో ప్రాతినిధ్యాన్ని పెంచారు. మహారాష్ట్ర నుంచి కొత్తగా నలుగురికి చోటిచ్చారు. ఒడిశా నుంచి ఇద్దరికి బెర్తులు లభించాయి. కర్ణాటక నుంచి ఖాళీ అయిన రెండు స్థానాల్లో కొత్తగా నలుగురికి చోటిచ్చారు. ఒక్కళిగ సామాజికవర్గానికి చెందిన సదానందగౌడను తొలగించడం వల్ల ఇప్పుడే అదే సామాజికవర్గానికి చెందిన శోభా కరంద్లాజేని తీసుకొచ్చారు. లింగాయత్‌ వర్గానికి చెందిన సురేష్‌ అంగడి స్థానాన్ని అదే సామాజికవర్గానికి చెందిన భగవంత్‌ ఖూబతో భర్తీచేశారు. చిత్రదుర్గ లోక్‌సభ స్థానం నుంచి తెలుగు మూలాలున్న దళిత నేత ఎ.నారాయణస్వామిని తీసుకొచ్చారు. రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేరళ రాష్ట్రానికి చెందిన వారు. కానీ ఆయన ప్రస్తుతం రాజ్యసభకు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిపబ్లిక్‌ టీవీ వ్యవస్థాపకుడిగా, వ్యాపారవేత్తగా ఈయనకు పేరుంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. ప్రతిపక్షాలపై దూకుడుగా దాడి చేయడంలో దిట్ట.

పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి

పశ్చిమబెంగాల్‌లో పార్టీని బలోపేతం చేసుకొనే దిశగా నలుగురికి స్థానం కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు బ్రహ్మరథం పట్టిన దళిత సామాజిక వర్గం మథువా ఠాకుర్‌ను మరింత దగ్గర చేసుకొనేందుకు శాంతను ఠాకుర్‌కు అవకాశం ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాబల్యం పెంచుకొనేందుకు జంగల్‌మహల్‌ ప్రాంతానికి చెందిన భాజపా నమ్మిన బంటు సుభాష్‌ సర్కార్‌కు పీట వేశారు. అలాగే భాజపా మంచి పనితీరు కనబరిచిన దార్జీలింగ్‌ ప్రాంతం నుంచి జాన్‌ బార్లా, కూచ్‌బిహార్‌ ప్రాంతం నుంచి నిశిత్‌ ప్రామాణిక్‌కు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతంలో 2024 నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకొని తృణమూల్‌ను బెంగాల్‌ ఉత్తర ప్రాంతంలో నిలువరించే వ్యూహంతో ఒకేసారి నలుగురికి అవకాశం ఇచ్చారు.

  • బిహార్‌లోనూ 2024 ఎన్నికల్లో గెలవాలంటే జేడీయూ, ఎల్‌జేపీల మద్దతు అవసరం. ఆ రాష్ట్రం నుంచి తీసుకున్న నలుగురిలో ముగ్గురు మిత్రపక్ష సభ్యులకు స్థానం కల్పించారు. భాజపా తరఫున రెండోసారి లోక్‌సభకు ఎన్నికైన మాజీ ఐఏఎస్‌ రాజ్‌కుమార్‌ సింగ్‌కు కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి కల్పించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసి, కేంద్ర మంత్రిగా క్రియాశీలకంగా ఉండటంతో ఆయనకు కేబినెట్‌ బెర్తు కల్పించారు.
  • మహారాష్ట్రకు చెందిన ప్రకాశ్‌ జావడేకర్‌, సంజయ్‌ శ్యామ్‌రావ్‌ ధోత్రే రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు ఆ స్థానంలో నలుగురికి ప్రాతినిధ్యం కల్పించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌రావ్‌ రాణే మరాఠా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ కొంకణ్‌ ప్రాంతంలో బలమైన నేతగా ముద్ర వేసుకున్నారు. మరాఠాల్లో ఓబీసీ వర్గానికి చెందిన కపిల్‌ పాటిల్‌కు అవకాశం ఇచ్చారు. మిగిలిన ఇద్దరూ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారే. వృత్తిరీత్యా ఇద్దరూ డాక్టర్లు కావడంతో చదువుకున్న వెనుకబడిన వర్గాలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో పెద్దపీట వేశారు.

ఇతర రాష్ట్రాల్లో..

తమిళనాడు నుంచి భాజపాకు ఇప్పటివరకూ ఎంపీలు లేకపోయినా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దళిత వర్గానికి చెందిన ఈయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు.

  • అస్సాంలో సోనోవాల్‌ నేతృత్వంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలిచినా ముందు ఇచ్చిన మాట ప్రకారం హిమంత బిశ్వశర్మను ముఖ్యమంత్రిని చేయడం వల్ల సోనోవాల్‌ను ఇప్పుడు కేంద్రంలోకి తీసుకొచ్చారు.
  • ఉత్తరాఖండ్‌ బ్రాహ్మణ వర్గానికి చెందిన రమేష్‌ పోఖ్రియాల్‌కు ఉద్వాసన పలకడం వల్ల అదే సామాజిక వర్గానికి చెందిన అజయ్‌భట్‌కు అవకాశం ఇచ్చారు.
  • కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కుడి భుజంగా ఉన్న భూపేందర్‌ యాదవ్‌ను తీసుకురావడానికి ప్రధాన కారణం ఓబీసీ నేతను పైకి తేవడం సహా పార్టీని నమ్ముకున్న వ్యక్తికి ప్రభుత్వంలో అవకాశం ఇవ్వడమే. అమిత్‌షా అప్పగించిన బాధ్యతలన్నింటినీ తు.చ. తప్పకుండా నెరవేరుస్తూ ఆయన అధికార కోటరీలో కీలక వ్యక్తిగా మారారు.
  • దిల్లీకి చెందిన హర్షవర్ధన్‌ను తప్పించడం వల్ల ఆ స్థానంలో అదే రాష్ట్రానికి చెందిన మీనాక్షి లేఖిని తీసుకున్నారు.
  • ఝార్ఖండ్‌, త్రిపురలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి ఆ రాష్ట్రాల నుంచి అన్నపూర్ణదేవి, ప్రతిమా భౌమిక్‌ను తీసుకున్నారు.

ఇదీ చదవండి : Cabinet Expansion: మోదీ కేబినెట్​లో భారీ ప్రక్షాళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.