కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు వ్యతిరేకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విమర్శించారు. వ్యవసాయ చట్టాల గురించి బాధపడుతున్న రాహుల్.. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతల కోసం ఎందుకు పని చేయలేకపోయారని ప్రశ్నించారు.
నిన్న యూపీకి చెందిన పలు రైతుసంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రిని కలిసి వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించగా.. ఇవాళ బాగ్‌పత్‌లోని కిసాన్ మజ్దూర్ సంఘ్, కిసాన్ సేనకు చెందిన 60 మంది కర్షకులు కొత్త సాగు చట్టాలకు ఎలాంటి సవరణలు చేయొద్దని కోరారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2 కోట్ల సంతకాలను సేకరించినట్లు రాహుల్ చెప్తున్నారు. కానీ, అలాంటిదేమీ లేదని తనను కలిసిన రైతులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీయే సీరియస్‌గా తీసుకోదని తోమర్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: 'ఈ చట్టాలు వ్యవసాయంలో కొత్త యుగానికి నాంది'