పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. స్టెప్పులతో అందరినీ అలరించారు. కుమార్తె వివాహ వేడుకలో డ్యాన్సు చేశారు. సతీమణితో కలిసి పాత కన్నడ సినిమాలోని ఓ పాటకు స్టెప్పులేశారు. జోషి.. డ్యాన్స్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
![couple took blessing of karnataka cm](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-hbl-01-joshi-dance-av-7208089_02092021112809_0209f_1630562289_55_0209newsroom_1630571457_866.jpg)
![couples with bommai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-hbl-01-joshi-dance-av-7208089_02092021112809_0209f_1630562289_337_0209newsroom_1630571457_63.jpg)
జోషి కుమార్తె అర్పిత.. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త రిషికేశ్‌ను వివాహమాడారు. కర్ణాటకలోని హుబ్లీలో ఈ పెళ్లి జరిగింది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్, సీఎం బసవరాజ బొమ్మై, కర్ణాటక శాసనమండలి ఛైర్మన్ బసవరాజ్ హోరత్తి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు.
![wedding group photo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-hbl-01-joshi-dance-av-7208089_02092021112809_0209f_1630562289_351_0209newsroom_1630571457_581.jpg)
![karnataka governor in wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-hbl-01-joshi-dance-av-7208089_02092021112809_0209f_1630562289_517_0209newsroom_1630571457_279.jpg)
రిసెప్షన్ వేడుకకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: Family murder: సొంత కుటుంబాన్నే కడతేర్చిన కొడుకు