కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటం వల్ల.. పరీక్షలు చేయుంచుకోగా కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారందరూ టెస్టులు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు.
"నాకు స్వల్పంగా వైరస్ లక్షణాలు కనిపించినందున ఈ రోజు పరీక్షలు చేయించుకుంటే కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇటీవల నాకు సన్నిహితంగా మెలిగినవారంతా దయచేసి జాగ్రత్తలు పాటించండి."
- జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి
సీఎం కేజ్రీవాల్ సతీమణికీ పాజిటివ్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌కూ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆమెతో పాటు సీఎం కూడా క్వారంటైన్లో ఉండనున్నట్టు దిల్లీ ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: స్పుత్నిక్-వి 10 రోజుల్లో భారత్‌లోకి!