ETV Bharat / bharat

టీకా సమర్థతపై చర్చకు సై: అమిత్​ షా - Ayushman Bharat: Pradhan Mantri Jan Arogya Yojana

కొవిడ్​-19 వ్యాక్సిన్​పై సందేహాలు రేకెత్తిస్తోన్న వారిపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం పట్ల ఎందుకు రాజకీయాలు చేస్తున్నారన్న ఆయన.. ఈ విషయమై ఇతర వేదికలపై చర్చించేందుకు సిద్ధమన్నారు. అసోంలోని గువాహటిలో జరిగిన 'ఆయుష్మాన్ సీఏపీఎఫ్​'​ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు షా.

Union Minister Amit Shah launches Ayushman Bharat health scheme for Central Armed Police Forces
సాయుధ బలగాల కోసం 'ఆయుష్మాన్​ భారత్​' ప్రారంభం
author img

By

Published : Jan 23, 2021, 10:50 PM IST

కరోనా టీకా సమర్థతపై ప్రశ్నించేవారిని తీవ్రంగా విమర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ప్రజారోగ్యం విషయంలో రాజకీయాలెందుకని విపక్షాలనుద్దేశించి అన్నారు. వ్యాక్సిన్​పై అసత్య ప్రచారం ఆపాలని కోరిన షా.. ఈ విషయమై మరో వేదికగా చర్చలకు తాము సిద్ధమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్​ను దేశంలో ప్రారంభించామన్న ఆయన.. భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని చెప్పారు. అసోంలోని గువాహటిలో జరిగిన 'ఆయుష్మాన్ భారత్​'​ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"వ్యాక్సిన్​పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇతర వేదికలపైకి రండి.. వ్యాక్సిన్​ సమర్థతపై చర్చిద్దాం. కానీ ఇలా ప్రజల ఆరోగ్యంపై రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ప్రజలందరికీ చెబుతున్నా.. మన శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన సురక్షితమైనది. సందేహాలు వద్దు. మీ వంతు వచ్చినప్పుడు టీకా వేయించుకోండి."

---- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

'ఆయుష్మాన్​ సీఏపీఎఫ్​​' ఆరోగ్య పథకం ప్రారంభోత్సవం సందర్భంగా.. పలువురు కేంద్ర బలగాల సిబ్బందికి ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు షా. సీఏపీఎఫ్​ సిబ్బందికి ప్రధానంగా మూడు సమస్యలున్నాయని.. అవి హెల్త్​ కవరేజీ సమగ్రంగా లేకపోవడం, నివాస సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, సెలవులు లేకుండా దీర్ఘకాలం పాటు విధులు నిర్వహించడమని పేర్కొన్నారు. అయితే.. త్వరలోనే తమ ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు షా.

ఇదీ చదవండి: 'నేతాజీ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.