ETV Bharat / bharat

'ప్రతిభలో వారిని సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నాం' - సుప్రీంకోర్టు తాజా వార్తలు

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీ, ఎస్టీలను ప్రతిభలో ఉన్నత వర్గాలతో సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు వివిధ ఉద్యోగాల్లో గ్రూపు-ఏ పోస్టులు పొందడానికి వీలుగా సుప్రీంకోర్టే తగిన ప్రాతిపాదనలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని కోరింది.

sc st reservations case
సుప్రీంకోర్టు
author img

By

Published : Oct 7, 2021, 7:17 AM IST

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీ, ఎస్టీలను ప్రతిభలో ఉన్నత వర్గాలతో సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నామని, ఇది వాస్తవమని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే విషయమై దాఖలైన దావాను విచారిస్తున్న జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ల ధర్మాసనం ముందు కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ పై అభిప్రాయం వ్యక్తంచేశారు. వివిధ ఉద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల వివరాలతో కేంద్రం నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించిన ధర్మాసనం.."గ్రూపు-ఏలో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఈ గ్రూపులో వారి సంఖ్యను పెంచే బదులు..'బి', 'సి' కేటగిరీల్లో వారికి తగిన ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. ఇది సరికాదు" అని పేర్కొంది.

దీనిపై వేణుగోపాల్‌ స్పందిస్తూ సొంత ప్రతిభ ఆధారంగా గ్రూపు-ఏ ఉద్యోగాలు పొందాల్సి ఉంటుందని చెప్పారు. ఇక్కడ సమర్థతకే తప్ప, వెనుకబాటుతనానికి అంత ప్రాధాన్యం లేదని చెప్పారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఈ పోస్టులు పొందడానికి వీలుగా సుప్రీంకోర్టే తగిన ప్రాతిపదికలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమయిందని కోరారు. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బల్బీర్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ ఎ, బి, సి, డి గ్రూపుల ఉద్యోగాలకు సంబంధించి 1965-2017 వరకుగల సమాచారాన్ని సమర్పించామని చెప్పారు. ఎ, బి గ్రూపుల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని తెలిపారు. 'సి'లో ఫరవాలేదని, 'డి'లో మాత్రం అధిక రిజర్వేషన్లు పొందారని వివరించారు. రిజర్వేషన్ల కన్నా ఎక్కువ పోస్టులు ఎలా ఉంటాయని ధర్మాసనం ప్రశ్నించగా తొలుత ఉద్యోగాల్లో చేరిన వారు, అనంతరం పదోన్నతులు పొందిన వారిని లెక్కిస్తే రిజర్వేషన్ల కన్నా ఎక్కువగా ఉన్నట్టు తేలుతుందని సమాధానం ఇచ్చారు. అలాంటప్పుడు ఈ కేటగిరీ ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఉపసంహరించాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి వాదనలను గురువారానికి వాయిదా వేసింది.

సుప్రీంలో అరుదైన దృశ్యం..

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో వారి తరఫు సీనియర్‌ న్యాయవాది ఆసుపత్రి నుంచే వాదనలు వినిపించారు. జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవయ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించే సమయానికి సీనియర్‌ న్యాయవాది ఆసుపత్రిలో ఉన్న దృశ్యం స్క్రీన్‌పై కనిపించింది. ఆయన వాదనలు వినిపించడానికి ఉద్యుక్తులవుతుండగా "ముందు... మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి?" అంటూ సీనియర్‌ న్యాయవాదిని జస్టిస్‌ నాగేశ్వరరావు పరామర్శించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.