ETV Bharat / bharat

ఇంటికి రావాలని ఉంది: ఉక్రెయిన్​ ఆర్మీలోని 'భారతీయుడు'​ - ఉక్రెయిన్ ఆర్మీ సైనికేశ్

Ukraine Army Sainikesh: రష్యా- ఉక్రెయిన్ భీకర యుద్ధంలో ఉక్రెయిన్​ తరఫున పోరాడుతున్నాడు భారతీయ యువకుడు సైనికేశ్​ రవిచంద్రన్. అయితే తాజాగా ఇంటిపై బెంగ పెట్టుకున్న సైనికేశ్​.. స్వదేశానికి రావాలని ఉందని చెప్పినట్లు అతడి తండ్రి 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు.

Ukrainian army
ఉక్రెయిన్ ఆర్మీ
author img

By

Published : Mar 13, 2022, 12:11 PM IST

Ukraine Army Sainikesh: ఉక్రెయిన్ ఆర్మీలో చేరి రష్యాతో వీరోచితంగా పోరాడుతున్న భారతీయ యువకుడు ఇంటిపై బెంగ పెట్టుకున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. తన కుమారుడు భారత్​కు రావాలని అనుకుంటున్నట్లు యువకుడి తండ్రి 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

Ukrainian army
ఆర్మీ దుస్తుల్లో సైనికేశ్ రవిచంద్రన్

తమిళనాడు, కోయంబత్తూర్​కు చెందిన 21ఏళ్ల సైనికేశ్​ రవిచంద్రన్.. భారత సైన్యంలో చేరేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ ఇక్కడ అవకాశం లభించకపోవడంతో ఉక్రెయిన్​ వెళ్లి ఆ దేశం తరఫున యుద్ధం చేస్తున్నాడు.

Ukrainian army
తల్లితో సైనికేశ్

ఉక్రెయిన్​లోని ఖర్కివ్ నేషనల్ వర్సిటీలో ఏరోస్పేస్​ ఇంజినీరింగ్ చేస్తున్న సైనికేశ్.. ఉక్రెయిన్​, రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఈ విషయాన్ని తమిళనాడు ఇంటెలిజెన్స్, కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించాయి.

Ukrainian army
ఉక్రెయిన్ ఆర్మీతో సైనికేశ్

"మేము సైనికేశ్​​తో ఫోన్​లో మాట్లాడాం. ఆర్మీలో పనిచేయాలన్న తన కోరిక నెరవేరిందని ఇక ఇంటికి రావాలని ఉందని చెప్పాడు మాతో. ఓ పక్క యుద్ధం జరుగుతున్నందున మాతో ఎక్కువ సేపు మాట్లాడలేదు." అని సైనికేశ్ తల్లిదండ్రులు 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

.

ఇదీ చూడండి: కశ్మీర్​లో మరో సర్పంచ్​పై ఉగ్రదాడి.. ఐజీ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.