ETV Bharat / bharat

భారత్​లో బ్రిటన్​ హోంమంత్రి భూముల ఆక్రమణ.. ఎక్కడంటే?

ఇటీవల బ్రిటన్​లోని లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వంలో హోంమంత్రిగా నియమితులైన సుయెలా బ్రావెర్మన్‌ పూర్వీకుల ఆస్తులు భారత్​లో ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

uk home secretary
uk home secretarys father complains that his ancestral property in goa grabbed sit begins probe
author img

By

Published : Sep 10, 2022, 7:37 PM IST

Suella Braverman Goa : యూకే హోం మంత్రి సుయెలా బ్రావెర్మన్‌ పూర్వీకుల ఆస్తులు భారత్‌లో ఆక్రమణకు గురయ్యాయి. దీంతో ఆమె తండ్రి గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర గోవాలోని అసగావ్‌ గ్రామంలో తనకు, తన కుటుంబసభ్యులకు ఆస్తులు ఉన్నాయని బ్రావెర్మన్‌ తండ్రి క్రిస్టీన్‌ ఫెర్నాండెజ్‌ తెలిపారు. వీటిలో 13,900 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే రెండు ప్లాట్లను గుర్తుతెలియని వ్యక్తి ఆక్రమించారు.

సదరు వ్యక్తి పవార్‌ ఆఫ్‌ ఆటార్నీ ద్వారా ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. జులై 27నే ఈ ప్రక్రియ మొదలవ్వగా.. దీని గురించి ఆగస్టులో ఫెర్నాండెజ్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సవాంత్‌, రాష్ట్ర డీజీపీ జస్పాల్‌ సింగ్‌, గోవా ఎన్నారై కమిషనరేట్‌కు ఇ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భారత సంతతికి చెందిన బ్రావర్మన్‌ ఇటీవల లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వంలో హోంమంత్రిగా నియమితులయ్యారు. తండ్రి క్రిస్టీన్‌, తల్లి ఉమా ఫెర్నాండెజ్‌ పూర్వీకులు భారత్‌కు చెందినవారు. వీరి కుటుంబాలు భారత్‌ నుంచి కెన్యాకు వలసవెళ్లి.. ఆ తర్వాత బ్రిటన్‌లో స్థిరపడ్డాయి.

ఇవీ చదవుండి: 12 అడుగుల కింగ్​ కోబ్రా కలకలం.. ఇంట్లోకి వెళ్తుండగా..

ఏడేళ్ల బాలికపై రేప్​.. యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.