ETV Bharat / bharat

సూపర్​ హెయిర్​ స్టైలిస్ట్​.. ఒకేసారి 28 కత్తెర్లతో కటింగ్ - 28 కత్తెర్లు హెయిర్​ స్టైలిస్ట్​

Hair Stylist Using 28 Scissors: మధ్యప్రదేశ్​కు చెందిన ఓ హెయిర్​స్టైలిస్ట్ అరుదైన ఘనత సాధించాడు. ఒకటి రెండు కాకుండా ఏకంగా ఒకే సారి 28 కత్తెర్లతో జుట్టును కత్తిరించి రికార్డు సృష్టించాడు. తన ప్రతిభతో 'ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​'లో స్థానం సంపాదించాడు.

ujjain hair stylist record
ujjain hair stylist record
author img

By

Published : Apr 14, 2022, 2:47 PM IST

సూపర్​ హెయిర్​ స్టైలిస్ట్​.. ఒకేసారి 28 కత్తెర్లతో కటింగ్

Hair Stylist Using 28 Scissors: హెయిర్​స్టైల్స్​కు యువతలో ఉండే క్రేజే వేరు. ట్రెండ్​కు తగ్గట్టుగా కొత్త కొత్త స్టైల్స్​ ఫాలో అవుతుంటారు. చాలా మంది సినిమా హీరోల హెయిర్​ స్టైల్స్​​ను అనుసరిస్తున్నారు. మరోవైపు హెయిర్​ స్టైలిస్టులు కూడా తమదైన శైలిలో రకరకాల హెయిర్​స్టైల్స్​ చేసి ఆకట్టుకుంటారు. మధ్యప్రదేశ్​కు చెందిన ఆదిత్య అనే హెయిర్​ స్టైలిస్ట్​ కూడా ఈ కోవకు చెందిన వాడే. తన ప్రత్యేకమైన కటింగ్​ స్టైల్​తో అబ్బురపరిచే ఈ యువకుడు.. ఒకటి రెండు కాదు ఏకంగా 28 కత్తెర్లతో హెయిర్​ స్టైలింగ్​​ చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు.

హెయిర్​ స్టైల్​ చేస్తున్న ఆదిత్య
హెయిర్​ స్టైల్​ చేస్తున్న ఆదిత్య

నాలుగేళ్ల పాటు ప్రాక్టీస్​.. ఉజ్జయిని నగరంలోని ఫ్రీగంజ్ ప్రాంతంలో తన తండ్రి, సోదరుడితో కలిసి 'క్రియేషన్ వరల్డ్ - ది యునిసెక్స్ సెలూన్​' పేరిట హెయిర్ సెలూన్‌ను నడుపుతున్నాడు 26 ఏళ్ల ఆదిత్య దేవర. సెలూన్​కు వచ్చే యువకులకు తనదైన శైలిలో అద్భుతంగా హెయిర్​ స్టైల్స్ ​ చేస్తుంటాడు. ఇప్పుడు.. ఒకేసారి 28 కత్తెర్లతో జుట్టును కత్తిరించి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​'లో స్థానం సంపాదించాడు. ఇంతకుముందు ఈ రికార్డు 22 కత్తెర్లతో జుట్టు కత్తిరించిన ఇరాన్ యువకుడి పేరిట ఉంది. ఆదిత్య సోషల్ మీడియాలో ఇరాన్ హెయిర్‌స్టైలిస్ట్ 22 కత్తెర్లతో జుట్టును కత్తిరించిన వీడియోను చూసి ప్రాక్టీస్​ మొదలుపెట్టాడు.నాలుగేళ్ల పాటు ప్రాక్టీస్ చేసిన ఆదిత్య 28 కత్తెర్లతో జట్టును కత్తిరించి.. ఆ వీడియోను ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​ నామినేషన్​ కోసం పంపించాడు. ఆదిత్య కృషిని గుర్తించిన నిర్వాహకులు ఈ ఘనతను రికార్డుల్లో నమోదు చేశారు.

హెయిర్​ స్టైల్​ చేస్తున్న ఆదిత్య
28 కత్తెర్లతో హెయిర్​ స్టైల్​ చేస్తున్న ఆదిత్య
హెయిర్​ స్టైల్​ చేస్తున్న ఆదిత్య
ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​

ఇదీ చదవండి: 600 ఏళ్ల నాటి దేవతల విగ్రహాలు స్వాధీనం.. విలువ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.