UGC Good News to College Students: విద్యార్థులు కాలేజీల్లో చేరే సమయంలో.. వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను మెజారిటీ కాలేజీ యాజమాన్యాలు తీసుకుంటాయన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా.. ఏదైనా కారణంతో సదరు కళాశాలలో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే.. అడ్మిషన్ సమయంలో తీసుకున్న ఫీజును తిరిగి చెల్లించట్లేదు. దీంతో.. ప్రతి సంవత్సరమూ చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(UGC) విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కాలేజీలు, యూనివర్సిటీలకు కూడా పలు హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.
అడ్మిషన్ పొందిన విద్యార్థుల ఒరిజినల్ డాక్యుమెంట్లను.. కాలేజీలు, యూనివర్సిటీలు తమ వద్ద ఉంచుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. అడ్మిషన్ పొందిన విద్యార్థులు.. ఏదైనా కారణం చేత నెలలోపు అడ్మిషన్ ఉపసంహరించుకుంటే.. చెల్లించిన ఫీజును తిరిగి విద్యార్థికి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది.
రిఫండ్ నింబధనలు (UGC Refund Rules) : UGC ప్రకారం.. ఒక విద్యార్థి అడ్మిషన్ ఉపసంహరించుకున్న సమయంలో.. దిగువ పేర్కొన్న నిబంధనల ప్రకారం విద్యా సంస్థలు ఫీజును వాపసు చేయాల్సి ఉంటుంది.
- అడ్మిషన్స్ ముగిసే చివరి తేదీకి (అధికారికంగా నోటిఫై చేసిన డేట్) 15 రోజుల కన్నా ముందు విద్యార్థులు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే.. వారికి 100 శాతం ఫీజు రిఫండ్ చేయాలి.
- అడ్మిషన్స్ ముగిసే చివరి తేదీకి.. 15 రోజులలోపు క్యాన్సిల్ చేసుకుంటే.. 90 శాతం ఫీజు రిఫండ్ చేయాలి.
- అడ్మిషన్స్ ముగిసిపోయిన తర్వాత.. 15 రోజుల్లోపు క్యాన్సిల్ చేసుకుంటే.. 80 శాతం ఫీజు రిఫండ్ చేయాలి.
- అడ్మిషన్స్ ముగిసిపోయిన తర్వాత.. 16 రోజుల నుంచి 30 రోజుల మధ్య క్యాన్సిల్ చేసుకుంటే.. 70 శాతం ఫీజు రిఫండ్ చేయాలి.
- అడ్మిషన్స్ ముగిసిపోయిన 30 రోజుల తర్వాత అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే.. ఫీజు రిఫండ్ చేయరు.
నిబంధనలు ఉల్లంఘిస్తే.. కాలేజీలపై చర్యలు..
యూజీసీ ప్రకారం.. ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమైన విద్యాసంస్థలకు జరిమానా విధిస్తారు. అంతేకాదు.. UGC నుంచి ఎటువంటి సాయమూ అందదు. ఉన్నత విద్యాసంస్థల హోదా, అనుబంధం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంకా.. తమ కళాశాలలకు సంబంధించిన వివరాలను యూజీసీ అధికారిక వెబ్సైట్లో నమోదు చేయాలి.
- విద్యాసంస్థ ప్రస్తుత స్థితి
- యూజీసీతో ఇన్స్టిట్యూట్ అనుబంధం ఏంటి?
- అక్రిడిటేషన్ స్థితి
- భౌతిక ఆస్తులు ఇంకా సౌకర్యాల వివరాలు
- కోర్సుల వారీగా విద్యార్థుల జాబితా
- మొత్తం కోర్సుకు చెల్లించాల్సిన ఫీజు
- అడ్మిషన్ చివరి తేదీ
- అధ్యాపకుల వివరాలు
- పాలకమండలి సభ్యులు
- ఆదాయ వనరులు
- ఆర్థిక పరిస్థితి
ఈ సమాచారాన్ని తప్పక అందించాలని UGC ఆదేశించింది. ఈ సమాచారం విద్యార్థులు అడ్మిషన్ పొందే సమయంలో.. ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.
మంత్రి ఏమన్నారంటే..
విద్యార్థుల సర్టిఫికెట్లకు సంబంధించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్మిషన్ ఫారమ్‌ను సమర్పించే సమయంలో.. ఏ విద్యార్థి కూడా తమ మార్క్‌షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ వంటి ఒరిజనల్ సర్టిఫికెట్లను కాలేజీలకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. స్టూడెంట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను ఏ సంస్థ కూడా తమ ఆధీనంలోకి తీసుకోకూడదని చెప్పారు. అంతే కాకుండా ఒకవేళ విద్యార్థి నోటిఫైడ్ అడ్మిషన్ చివరి తేదీకి 15 రోజుల ముందు అడ్మిషన్‌ను ఉపసంహరించుకుంటే.. అతను లేదా ఆమె 100 శాతం రిఫండ్‌కు అర్హులని స్పష్టం చేశారు.
Aadhaar Number On Degree Certificate : ఇక డిగ్రీ మార్కుల మెమోపై నో ఆధార్ నంబర్.. UGC కీలక ఆదేశాలు
భారత్‌లో విదేశీ వర్సిటీల క్యాంపస్‌లు.. UGC గ్రీన్ సిగ్నల్
ఏకకాలంలో రెండు డిగ్రీలు.. భారతీయ, విదేశీ విద్యాసంస్థలు కలిసి!