యూజీసీ-నెట్ పరీక్ష తేదీలను ప్రకటించింది కేంద్ర విద్యాశాఖ. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కోసం నిర్వహించే యూజీసీ-నెట్(జాతీయ అర్హత పరీక్ష)ను మే నెలలో నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. దీనికి సంబంధించి జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
"జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ల అర్హత కోసం ఎన్టీఏ నిర్వహించే యూజీసీ-నెట్ పరీక్షలు.. 2021 మే 2,3,4,5,6,7,10,11,12,14,17 తేదీల్లో జరగనున్నాయి. పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు."
- రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర విద్యా శాఖ మంత్రి
మేలో నిర్వహించనున్న ఈ నెట్ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. దీనిని కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.
ఇదీ చూడండి: దిల్లీలో 56% మందిపై కరోనా ప్రభావం!