ETV Bharat / bharat

మోదీకి బ్యానర్లు కట్టాలని విద్యాసంస్థలకు ఆదేశాలు

యువతకు ఉచిత వ్యాక్సిన్​లు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలపాలని యూజీసీ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థల ముందు బ్యానర్లు కట్టాలని ఆదేశించింది.

thanks modi
మోదీకి ధన్యవాదాలు
author img

By

Published : Jun 22, 2021, 8:29 AM IST

యువతకు ఉచితంగా టీకాలు ఇస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ బ్యానర్లు కట్టాలని యూజీసీ అన్ని విద్యా సంస్థలను ఆదేశించింది. ఆ మేరకు యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్ ఆదివారం వివిధ విశ్వవిద్యాలయాల అధికారులకు వాట్సప్ సందేశాలు పంపించారు. ఈ విషయాన్ని కనీసం మూడు విశ్వవిద్యాలయాల అధికారులు ధ్రువీకరించారు. దీనిపై జైన్ మాత్రం స్పందించలేదు.

ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోనూ..

సోమవారం నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇస్తున్న నేపథ్యంలో హిందీ, ఇంగ్లీష్​ల్లో బ్యానర్లు కట్టాలని సూచించారు. సమాచార, ప్రసార శాఖ రూపొందించిన కొన్ని బ్యానర్ల నమూనాలను జత చేశారు. దిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, భోపాల్​లోని ఎల్ఎన్​సీటీ విశ్వవిద్యాలయం, బెన్నెట్ యూనివర్సిటీ, గురుగ్రామ్​లోని నార్త్​క్యాప్ యూనివర్సిటీలు ఆ మేరకు బ్యానర్లు కట్టాయి. ఈ చర్యను పలువురు విద్యావేత్తలు తప్పుబట్టారు.

"ఉచిత వ్యాక్సిన్​ ప్రజల హక్కు దీన్ని ప్రజాధనంతోనే వేస్తున్నారు. టీకాలు వేయటంలో జాప్యం జరిగింది. ఈ వైఫల్యం నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు." అని దిల్లీ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు అభా దేవ్ హబీబ్ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ''ఆత్మనిర్భర్​ భారత్​కు ప్రతిరూపం' నూతన పార్లమెంట్''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.