ETV Bharat / bharat

Udhayanidhi Stalin Statement on Sanatana Dharma : 'మణిపుర్​, అవినీతి నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ.. కోర్టుల్లోనే తేల్చుకుంటా' - Stalin Statement on Udhayanidhi Comments

Udhayanidhi Stalin Statement on Sanatana Dharma : సనాతన ధర్మానికి సంబంధించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మరోమారు తన వైఖరిని సమర్థించుకున్నారు తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్. మణిపుర్ హింస, అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు 'మోదీ అండ్ కో' ఈ వ్యవహారాన్ని ఓ పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. ఈ వివాదాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

udhayanidhi stalin statement on sanatana dharma
సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ ప్రకటన
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 11:35 AM IST

Updated : Sep 7, 2023, 12:57 PM IST

Udhayanidhi Stalin Statement on Sanatana Dharma : మణిపుర్ హింస, అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు 'మోదీ అండ్ కో' సనాతన ధర్మం వ్యవహారాన్ని ఓ పావుగా వాడుకుంటోందని మండిపడ్డారు తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్. తాము ఏ మతానికీ శత్రువులం కాదన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

సనాతన ధర్మంపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు ఉదయనిధి స్టాలిన్. 'సామాజిక న్యాయం ఎప్పటికీ వర్థిల్లాలి' అనే శీర్షికతో ఆ ప్రకటన జారీ చేశారు. పెరియార్, అన్న, కలైంజ్ఞర్, పెరసిరియార్ సిద్ధాంతాలు విజయవంతం అయ్యేలా చూసేందుకు అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. సెప్టెంబర్​ 2న తమిళనాడు ప్రగతిశీల రచయితలు, కళాకారుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ కావాలనే వక్రీకరించిందని ఆరోపించారు. "గత 9 ఏళ్లలో మీరు చేసినవన్నీ ఉత్తుత్తి హామీలే. ప్రజల సంక్షేమం కోసం మీరు అసలు ఏం చేశారు? అని ఇప్పుడు అందరూ ముక్తకంఠంతో నియంతృత్వ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అందుకే బీజేపీ నేతలు నా ప్రసంగానికి వక్రభాష్యం చెప్పారు. తమను తాము కాపాడుకునేందుకు దీనిని ఒక ఆయుధంగా మార్చుకున్నారు.

  • Let us resolve to work for the victory of the ideologies of Periyar, Anna, Kalaignar and Perasiriyar. Let Social Justice flourish forever. pic.twitter.com/Eyc9pBcdaL

    — Udhay (@Udhaystalin) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై నేనే కేసులు పెట్టాలి..
అసత్య వార్తల ఆధారంగా.. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యకరం. గౌరవప్రదమైన పదవుల్లో ఉండి నాపై దుష్ప్రచారం చేసినందుకు అసలు నేనే వారిపై కేసులు పెట్టాలి. కానీ.. ఉనినికి నిలుపుకునేందుకు వారికి ఉన్న మార్గం ఇదేనని నాకు తెలుసు. అందుకే నేను అలా చేయలేదు." అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఉదయనిధి స్టాలిన్.

9ఏళ్లుగా మోదీ చేసింది ఏమీ లేదు..
ద్రవిడ దిగ్గజం, డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్​ అన్నాదురై రాజకీయ వారసుల్లో తానూ ఒకరినని అన్నారు ఉదయనిధి. డీఎంకే అన్ని మతాలను గౌరవిస్తుందని, పుట్టుకతో అందరూ సమానమేనని భావిస్తుందని చెప్పారు. "కానీ.. మోదీ అండ్ కోకు ఇవేవీ తెలియవు. పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొనేందుకు వారు ఇలా నిందలు వేస్తున్నారు. కానీ.. వారిని చూస్తే బాధ కలుగుతుంది. గత 9ఏళ్లుగా మోదీ చేసింది ఏమీ లేదు. అప్పుడప్పుడు నోట్లు రద్దు చేస్తారు. పేదల గుడిసెలు కనిపించకుండా గోడలు కడతారు. పార్లమెంటుకు కొత్త భవనం కట్టి, అందులో సెంగోల్​ను ప్రతిష్ఠిస్తారు. దేశం పేరు మార్చి ఆడుకుంటారు. సరిహద్దుల్లో నిల్చుని తెల్లజెండా ఎగరేస్తారు." అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు స్టాలిన్.

అందుకే మోదీ అండ్ కో ఇలా చేస్తున్నారు..
చిన్న పిల్లలు, మహిళల కోసం డీఎంకే ప్రభుత్వాలు తెచ్చిన పథకాల్ని ప్రస్తావించారు ఉదయనిధి. అలాంటి ఒక్క పథకమైనా గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు. మదురైలో ఎయిమ్స్ నిర్మించారా అని నిలదీశారు. "మణిపుర్ గురించి భారత్​లో అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక.. తన మిత్రుడు అదానీతో కలిసి ఆయన(మోదీ) ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు. ప్రజల అమాయకత్వమే వారి రాజకీయాలకు పెట్టుబడి. మణిపుర్​ అల్లర్లలో 250 మంది ప్రజల హత్య, రూ.7.5లక్షల కోట్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మోదీ అండ్ కో ఈ సనాతన ధర్మం అనే పావును వాడుకుంటున్నాయి." అని ఆరోపించారు. అయితే.. 2024 లోక్​సభ ఎన్నికల కోసం చేయాల్సిన పని చాలా ఉందని.. పార్టీ కార్యకర్తలు దానిపై దృష్టి పెట్టాలని కోరారు. తనపై నమోదైన కేసుల్ని.. పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్) మార్గదర్శకత్వంలో న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు ఉదయనిధి.

స్టాలిన్ స్పందన..
Stalin Statement on Udhayanidhi Comments : ఉదయనిధి వ్యవహారంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఉదయనిధి.. కులవివక్షపై తన అభిప్రాయాలు చెప్పారే తప్ప ఏ మతాన్నీ, మత విశ్వాసాల్నీ కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అణచివేత విధానాలపై ఉదయనిధి వైఖరిని ఓర్వలేకనే.. బీజేపీ అనుకూల శక్తులు ఇలా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు స్టాలిన్.

"ఉదయనిధి వ్యాఖ్యలపై దీటుగా స్పందించాలని మంత్రిమండలి సమావేశంలో ప్రధాన మంత్రి సూచించారని జాతీయ మీడియా ద్వారా తెలిసింది. ఇది చాలా బాధాకరం. నిజానిజాలు ఏంటో తెలుసుకునేందుకు అవసరమైన వనరులన్నీ ప్రధాన మంత్రికి అందుబాటులో ఉంటాయి. మరి ఉదయనిధి గురించి ప్రచారం చేస్తున్న అసత్యాలు ఏంటో తెలియకుండానే ప్రధాని మాట్లాడుతున్నారా? లేక అన్నీ తెలిసే ఇలా అంటున్నారా?" అని ప్రశ్నిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు స్టాలిన్.

  • On Tamil Nadu Minister Udhayanidhi Stalin's 'Sanatana Dharma should be eradicated', Tamil Nadu CM MK Stalin says "He expressed his views on Sanatan principles that discriminate against Scheduled Castes, Tribals, and Women, with no intention to offend any religion or religious… pic.twitter.com/pq2GP0esRp

    — ANI (@ANI) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

G20 Summit 2023 India : 'విశ్వ కుటుంబంగా ముందడుగు.. జీ20 అధ్యక్ష స్థానంలో భారత్​ కీలక పాత్ర'

Yogi Adityanath Twitter Followers : పవర్​ఫుల్​ 'యోగి'.. మోదీ, షా తర్వాత ప్లేస్ ఆయనదే.. ఇదిగో కొత్త లెక్క!

Last Updated : Sep 7, 2023, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.