ETV Bharat / bharat

Udhayanidhi Stalin Santana Dharma : సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్​ - ఉదయనిధి స్టాలిన్‌ హిందువు

Udhayanidhi Stalin Santana Dharma : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. విశ్వహిందూ పరిషత్‌ సహా పలు సంఘాలు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, అవమానకరంగా ఉన్నాయని.. సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్‌ జిందాల్‌ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Udhayanidhi Stalin Santana Dharma
Udhayanidhi Stalin Santana Dharma
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 12:16 PM IST

Updated : Sep 3, 2023, 12:45 PM IST

Udhayanidhi Stalin Santana Dharma : తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సహా హిందూ సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

దిల్లీ పోలీసులకు ఫిర్యాదు
సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, అవమానకరంగా ఉన్నాయని.. సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్‌ జిందాల్‌ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు.. మత విశ్వాసాలను దెబ్బతీశాయని ఆయనపై కేసు పెట్టాలని పోలీసులను కోరారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, సనాతన ధర్మం దోమలాంటిదని, కరోనా, మలేరియా వంటిదని మంత్రి ఉదయనిధి ఒక కార్యక్రమంలో అన్నారని జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఉదయనిధి అన్ని మతాలను సమానంగా చూడాల్సి ఉందని ఆయన చెప్పారు. కానీ కావాలనే ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో న్యాయవాది జిందాల్‌ ఆరోపించారు.

'కొందరి నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతోంది'
Udhayanidhi Stalin On Hinduism : ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తమిళనాడులో కొందరి నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన కాశీ, తమిళ సంగమం కార్యక్రమాన్ని ఆ రాష్ట్రంలో ప్రతి గ్రామం ఆదరించిందని ఆయన గుర్తుచేశారు. సనాతన ధర్మం శాశ్వతమైనదని.. ఇలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యల వల్ల దానికి ఏమీ జరగబోదని తెలిపారు.

తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ 'ఇండియా' కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత షానవాజ్‌ హుస్సేన్‌ చెప్పారు. ఆయన తనయుడైన ఉదయనిధి స్టాలిన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని.. దేశంలో ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ఉదయనిధి వ్యాఖ్యలపై తమ వైఖరిని తెలియజేయాలని హుస్సేన్​ డిమాండ్‌ చేశారు.

Udhayanidhi Stalin Latest News : 'తమిళనాడు ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌' సంస్థ.. 'సనాతన నిర్మూలన' అనే ఇతివృత్తంతో శనివారం.. సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉదయనిధి స్టాలిన్‌ అతిథిగా హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యనించారు. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని అన్నారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు.

Last Updated : Sep 3, 2023, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.