ETV Bharat / bharat

'22-02-2022'... ఈరోజు 'టూస్​ డే'.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Twosday news: 'వికటకవి'... ఈ పదాన్ని ఎటు నుంచి చదివినా ఒకే అర్థం వస్తుంది. ఈరోజు తేదీ కూడా అంతే. గమనించారా? 22-02-2022... దీన్ని ఎటు నుంచి చూసినా తేదీ ఒకటే వస్తుంది. ఈ తేదీకి ఉన్న మరిన్ని ప్రత్యేకతలు ఏంటంటే?

today is special day
today is special day
author img

By

Published : Feb 22, 2022, 10:06 AM IST

Updated : Jun 29, 2022, 1:14 PM IST

Twosday news: ఈరోజు తేదీని గమనించారా? ఈ రోజుకో ప్రత్యేకత ఉంది. అవును! ఈ రోజు తేదీ 22-02-2022. ఇదో పాలిండ్రోమ్ నెంబర్. అంటే ముందు నుంచి చదివినా, వెనక నుంచి చదివినా ఈ నెంబర్ ఒకే రకంగా ఉంటుంది. తెలుగులో 'వికటకవి' పదం పాలిండ్రోమ్​కు ఓ ఉదహరణ.

special date 2022

అంతేకాదు, ఈరోజు 'టూ'స్ డే! తేదీలో 2 అంకె అత్యధిక సార్లు వచ్చింది కాబట్టి దీన్ని టూస్​డేగా పిలుచుకుంటున్నారు. దీంతో పాటు ఈ రోజు మంగళవారం. దీన్ని ఇంగ్లిష్​లో ట్యూస్​డే అని పిలుస్తారు. ఈ రంకంగానూ టూస్​డేకు ప్రత్యేకత వచ్చింది.

Twosday 2022 news

నిజానికి టూస్​డేకు చారిత్రకంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదు. కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం కూడా ఎలాంటి ప్రత్యేకత లేదు. అయితే, ఈ తేదీన సంఖ్యల అమరిక ఆసక్తికరంగా ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం 2 అంకె చంద్రుడిని సూచిస్తుంది. ఈ తేదీ కొందరికి మంచి చేస్తుందని భావిస్తుంటారు.

ఇక ఆస్ట్రాలజీ విశ్వసించని వారు కూడా ఈ రోజు.. గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటున్నారు. కొన్ని దేశాల్లో అయితే గర్భవతులు.. పట్టుబట్టి ఇదే రోజున డెలివరీలు అయ్యేలా చూసుకుంటున్నారు. ఈరోజు జన్మించిన శిశువు పుట్టిన తేదీ.. ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని అంటున్నారు.

ఇదీ చదవండి: Horoscope Today (22/02/22): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

Last Updated : Jun 29, 2022, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.