ఒడిశా గంజాం జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. దిగపహండి పోలీసు స్టేషన్ పరిధిలోని ఘైగూడ వద్ద రహదారిపై కల్వర్టు నిర్మాణ పనులు చేస్తున్న కూలీలపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.


దీంతో కొండచరియల కింద ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని అధికారులు కాపాడారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ముగ్గురిని స్వల్పగాయాలతో బయటకు తీశారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.


ఆ కల్వర్టు నిర్మాణ పనుల్లో 20 మంది కూలీలు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: Viral Video: రాడ్డుతో బైకర్ తల పగలగొట్టిన వ్యక్తి