కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాల పాటు కర్ఫ్యూ విధించింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 14 రోజుల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. ప్రజా రవాణా వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుందని వెల్లడించారు.
వీటికి మినహాయింపు..
కర్ఫ్యూ సమయంలో కొన్నింటికి మినహాయింపునిచ్చింది ప్రభుత్వం. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అనుమతించింది. అలాగే.. నిర్మాణ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కర్ఫ్యూ నుంచి ఉపశమనం కల్పించింది.