ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- నలుగురు ముష్కరులు హతం - జమ్ముకశ్మీర్​

terrorists killed in an encounter
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​
author img

By

Published : Mar 22, 2021, 6:23 AM IST

Updated : Mar 22, 2021, 9:31 AM IST

06:18 March 22

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా షోపియాన్​ జిల్లాలో భద్రతా దళాలు, ముష్కరుల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ క్రమంలో మొత్తం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి బలగాలు.  

జిల్లాలోని మనిహాల్​ ప్రాంతంలో ముష్కరులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఇరువురి మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో మొదట ఇద్దరు తీవ్రవాదులను హతమార్చినట్లు కశ్మీర్​ జోన్​ పోలీసు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించిన మరో ఇద్దరిని అదే ప్రాంతంలో మట్టుబెట్టినట్లు చెప్పారు. 

ఎన్​కౌంటర్​ నేపథ్యంలో మనిహిల్​ ప్రాంతంలో అంతర్జాల సేవలను నిలిపేశారు పోలీసులు.  

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీకి చెందిన 34వ రాష్ట్రీయ రైఫిల్స్​, సీఆర్​పీఎఫ్​కు చెందిన 178వ బెటాలియన్​ బలగాలు తనిఖీల్లో పాల్గొన్నాయి.  ఆదివారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభించి అర్ధరాత్రి వరకు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు జవాన్లు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు పాల్పడగా ఎన్​కౌంటర్​కు దారితీసింది.  

కాల్పుల్లో హతమైన ఇద్దరు ముష్కరులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించినట్లు చెప్పారు అధికారులు. మరో ఇద్దరి గుర్తింపు తెలియాల్సి ఉందన్నారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. 

Last Updated : Mar 22, 2021, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.