ETV Bharat / bharat

'దేశంలో ఇంకా 33% మందికి కరోనా ముప్పు!' - సర్వేలోని కీలక అంశాలు

దేశంలో ఇంకా 40 కోట్ల మంది కరోనా ఇన్​ఫెక్షన్​కు గురయ్యే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. దేశ జనాభాలో మూడింట రెండొంతుల మందిలో మాత్రమే ప్రస్తుతం కొవిడ్​ యాంటీబాడీలు ఉన్నట్లు ఐసీఎంఆర్​ సర్వే ఆధారంగా వెల్లడించింది.

Covid antibodies
కరోనా యాంటీబాడీలు
author img

By

Published : Jul 20, 2021, 5:22 PM IST

Updated : Jul 20, 2021, 7:41 PM IST

దేశ జనాభాలో 67శాతం మందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే మరో 40 కోట్ల మందికి ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్​) జాతీయ స్థాయిలో చేపట్టిన నాలుగో సెరో సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

50శాతం పిల్లలకు కరోనా..?

దేశంలో కరోనా వైరస్‌ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సెరో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్‌-జులై మధ్యకాలంలో ఐసీఎంఆర్​.. జాతీయ స్థాయిలో నాలుగో సెరో సర్వే చేపట్టింది. ఇందుకోసం ఈసారి చిన్నారులను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఇలా దేశంలో 6ఏళ్ల వయసుపైబడిన 67.6శాతం మందిలో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 6-17ఏళ్ల వయసున్న వారిలో 50 శాతం కొవిడ్‌ ప్రభావానికి గురైనట్లు తాజా సర్వేలో తేలింది. ఇక 45-60ఏళ్ల వయసున్న వారిలో అత్యధికంగా (77.6శాతం) యాంటీబాడీలు ఉండగా.. 60ఏళ్లకు పైబడిన వారిలో ఇవి 76శాతం ఉన్నట్లు వెల్లడైంది.

85శాతం ఆరోగ్య కార్యకర్తల్లో..

దేశవ్యాప్తంగా జరిపిన నాలుగో సెరో సర్వేను 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో చేపట్టారు. ఇందులో మొత్తం 28,975 మంది సాధారణ ప్రజలు పాల్గొనగా.. 7,252 మంది ఆరోగ్య సంరక్షణ వర్కర్లు. ప్రతి జిల్లా నుంచి కనీసం 100మంది ఆరోగ్య కార్యకర్తలు ఉండేట్లు చూసుకున్నారు. ఇలా సర్వేలో పాల్గొన్న మొత్తం ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో 85శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 90శాతం మంది వ్యాక్సిన్‌ పొందినవారేనని తెలిపింది.

సమూహాలకు దూరంగా ఉండాల్సిందే..

దేశంలో మూడో వంతు మందిలో ఇప్పటికే కొవిడ్‌ యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక, మతపరమైన, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించవద్దని హితవు పలికింది. అవసరం లేని ప్రయాణాలకూ ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారు మాత్రమే ప్రయాణాలు చేయవచ్చని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: దిల్లీకి డ్రోన్‌ దాడి ముప్పు- పోలీసులు అలర్ట్‌

Last Updated : Jul 20, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.