కర్ణాటక బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో మంగళవారం ఒక్క రోజే ఇద్దరు పరిశోధక విద్యార్థులు చనిపోయారు. వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. మరో విద్యార్థి పుట్‌బాల్ ఆడుతూ మరణించారు. మృతి చెందిన వారిని రణదీర్ కుమార్, రాహుల్ ప్రతాప్‌లుగా గుర్తించారు. రణదీర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో పీహెచ్డీ చేస్తుండగా.. రాహుల్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చదువుతున్నట్లు అధికారులు తెలిపారు.
రణదీర్ క్యాంపస్‌లో ఉండే వసతి గృహంలోనే ఉరి వేసుకుని చనిపోగా.. రాహుల్ మాత్రం స్థానికంగా ఉండే జింఖానా మైదానంలో పుట్‌బాల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో దగ్గరలోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు చెప్పినట్లు పేర్కొంది.