ETV Bharat / bharat

ఇంటి నుంచి ఎస్కేప్​.. ప్రియులను మనువాడి పోలీసు స్టేషన్​లో ప్రత్యక్షమైన అక్కాచెల్లెళ్లు - Sisters married their loved ones in madyapradesh

వరుసకు అక్కాచెల్లెళ్లు అయ్యే ఇద్దరు యువతులు.. నెలన్నర క్రితం ఇంటి నుంచి పారిపోయి ప్రేమించిన యువకులను పెళ్లి చేసుకున్నారు. అనంతరం భర్తలతో బుధవారం పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు. వీరి కోసం తీవ్రంగా గాలించిన కుటుంబ సభ్యులు.. యువతుల ఆచూకీ లభించని కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు వివాహ పత్రంతో పోలీసుల ముందుకొచ్చారు ఆ యువతులు.

two-sisters-run-away-from-home-and-get-married-their-lovers
పారిపోయి పెళ్లి చేసుకున్న ఇద్దరు అక్కాచెల్లెల్లు
author img

By

Published : Jan 5, 2023, 12:54 PM IST

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 2022 నవంబర్​16న రాత్రి పారిపోయిన వీరిద్దరు.. బుధవారం పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు. కోర్టు నుంచి వివాహ పత్రాలు సైతం తెచ్చుకున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని శివపురి జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కొలారస్ పట్టణానికి చెందిన పూజా పరిహార్ అనే యువతి.. సడోరాలోని దూరపు బంధువుల ఇంట్లో ఉంటుంది. వారికి కాజల్​ అనే అమ్మాయి ఉంది. వరుసకు అక్కాచెల్లెళ్లు అయ్యే వీళ్లిద్దరు నెల రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. అనంతరం నవంబర్​ 23న వారు ప్రేమించిన యువకులను పెళ్లి చేసుకున్నారు. కాజల్​.. మనీశ్​ పరిహార్​ అనే యువకుడిని పెళ్లి చేసుకోగా.. అజయ్​ సోని అనే అబ్బాయిని పూజ వివాహం చేసుకుంది.

ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు వారిద్దరి కోసం తీవ్రంగా గాలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వీరి ఆచూకీ కుటుంబ సభ్యులకు తెలియలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సంగతి తెలుసుకున్న యువతులు.. భర్తలతో కలిసి పోలీసులను సంప్రదించారు. తాము చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నామని పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ విషయాన్ని యువతుల కుటుంబ సభ్యులకు తెలియజేశారు పోలీసులు.

"యువతులు ఇద్దరు మేజర్లు. ఇష్టమైన వారిని పెళ్లి చేసుకునే అర్హత వారికి ఉంది. ఇద్దరి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నాం. అనంతరం యువతులిద్దరు వారి భర్తలతో వెళ్లిపోయారు" అని కొలారస్ పోలీసు స్టేషన్​ ఎస్​ఐ తెలిపారు. యువతులకు కుటుంబ సభ్యులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారని, అయినా ఇంటికి వెళ్లేందుకు వారు నిరాకరించారని ఆయన వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.