Two Sisters Living With Mothers Dead Body In Varanasi : ఏడాది క్రితం చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంటిలోనే పెట్టుకుని జీవిస్తున్నారు ఇద్దరు కూతుర్లు. బంధువుల రాకతో ఎట్టకేలకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగింది.
పోలీసుల వివరాలు ప్రకారం..
మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠి తన ఇద్దరు కూతుర్లు పల్లవి త్రిపాఠి(27), వైశ్విక్ త్రిపాఠి(17)తో కలిసి ఓ ఇంట్లో జీవించేవారు. పల్లవి మాస్టర్ డిగ్రీ చేసింది. చిన్న అమ్మాయి వైశ్విక్ పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితమే ఉషా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అయితే ఉషా ఓ చిన్న దుకాణం నడుపుకుంటూ జీవనం సాగించేది. అయితే గత ఏడాది డిసెంబర్ 8న ఉషా అనారోగ్యంతో మృతి చెందింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న అక్కాచెల్లిలిద్దరూ.. తల్లి మృతి చెందిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా ఇంట్లోనే పెట్టుకుని జీవిస్తున్నారు. ఆ అక్కాచెల్లెళ్లు.. వాళ్లకి కావల్సిన వస్తువుల కోసం అప్పుడప్పుడు బయటకు వెళ్లి తెచ్చుకునేవారు.
వెలుగులోకి ఎలా వచ్చిందంటే..
మీర్జాపుర్‌లో ఉంటున్న ధర్మేంద్ర కుమార్ చతుర్వేది.. బుధవారం మదర్వాలో ఉంటున్న తన చెల్లి ఉషా త్రిపాఠి చూసేందుకు ఇంటికి వచ్చాడు. బెల్ కొట్టినా.. ఎంత సేపటికి ఎవరూ తలుపులు తెరవటం లేదు. దీంతో అనుమానం వచ్చిన ధర్మేంద్ర.. పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లారు. చూస్తే.. ఓ గదిలో మహిళ అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉన్నారు. పోలీసులు ఇంట్లో నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
ఆ అక్కాచెల్లిళ్ల మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసుల దర్యాప్తులో తెలింది. అయితే తల్లి చనిపోయిన తేదీని గుర్తించుకున్నారని అది కాస్త అనుమానంగా ఉందని పోలీసులు అన్నారు. ప్రస్తుతం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారు.
ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.. కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ..