ETV Bharat / bharat

'అయోధ్యలో మసీదు కోసం కేటాయించిన స్థలం మాదే' - Sunni Central Waqf Board five-acre land ownership claim

అయోధ్యలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తమదే అంటూ దిల్లీకి చెందిన ఇద్దరు మహిళలు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశ విభజన సమయంలో తమ తండ్రికి ఈ స్థలాన్ని అప్పగించారని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని బదిలీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

Two sisters claim ownership of land offered for Ayodhya mosque
'అయోధ్యలోని ఐదెకరాల మసీదు స్థలం మాదే'
author img

By

Published : Feb 4, 2021, 8:10 AM IST

అయోధ్యలో మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ధన్నీపుర్​లోని ఆ స్థలం తమదే అంటూ దిల్లీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 8న లక్నో బెంచ్​ దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

పిటిషనర్ల వాదన

1947లో దేశవిభజన జరిగినప్పుడు తమ తండ్రి పంజాబ్​ నుంచి వచ్చి ఫైజాబాద్​(ప్రస్తుతం అయోధ్య) జిల్లాలో స్థిరపడ్డారని పిటిషనర్లు రాణీ కపూర్ అలియాస్ రాణి బలుజా, రమారాణి పంజాబీ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకు ధన్నీపుర్ గ్రామంలో 28 ఎకరాల స్థలాన్ని నాజుల్ శాఖ కేటాయించిందని తెలిపారు. ఐదేళ్ల కాలానికి ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత కూడా అది తన అధీనంలోనే ఉందని వెల్లడించారు. అనంతరం తమ తండ్రి పేరు రెవెన్యూ రికార్డుల్లోనూ చేర్చారని చెప్పారు.

అయితే, తర్వాత రికార్డుల నుంచి తమ తండ్రి పేరును తీసేశారని, దానిపై అయోధ్య అదనపు కమిషనర్ ముందు అప్పీల్ చేశారని వివరించారు. దీనిపై నిర్ణయం తమకు అనుకూలంగా వెలువడిందని, తండ్రి పేరును జాబితాలో చేర్చారని చెప్పారు. కాగా.. తర్వాత కన్సాలిడేషన్ అధికారులు రికార్డుల నుంచి తమ తండ్రి పేరును మళ్లీ తొలగించారని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా అయోధ్య కన్సాలిడేషన్ సెటిల్​మెంట్ అధికారి వద్ద అప్పీల్ చేసుకున్నామని, అయితే దాన్ని పరిగణలోకి తీసుకోకుండానే తమ 28 ఎకరాల స్థలం నుంచి 5 ఎకరాలను వక్ఫ్ బోర్డుకు కేటాయించారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో సెటిల్​మెంట్ అధికారి వద్ద పెండింగ్​లో ఉన్న సమస్య పరిష్కారమయ్యే వరకు స్థలాన్ని బదిలీ చేయకుండా ఉండాలని పిటిషన్​లో కోరారు.

ఇదీ చదవండి: ప్రజాస్వామ్య సూచీలో 53కు పడిపోయిన భారత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.