ETV Bharat / bharat

ముఖ్యమంత్రి సంతకం ఫోర్జరీ.. వ్యాపారికి రూ.కోటికి పైగా టోకరా - మహారాష్ట్ర ముఖ్యమంత్రి నకిలీ సంతకం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే నకిలీ సంతకంతో ఓ వ్యాపారికి రూ.1.31 కోట్లు టోకరా పెట్టారు ఇద్దరు వ్యక్తులు. వ్యాపారి ఫిర్యాదుతో నిందితులపై ఛీటింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

eknadh shinde news
ఏక్​నాథ్ శిందే నకిలీ సంతకం
author img

By

Published : Oct 2, 2022, 5:38 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే నకిలీ సంతకంతో ఓ వ్యాపారికి భారీగా టోకరా పెట్టారు ఇద్దరు మోసగాళ్లు. వ్యాపారి నుంచి విడతల వారీగా రూ.1.31 కోట్లు తీసుకున్నారు. నిందితులపై వాలివ్ పోలీస్ స్టేషన్​లో వ్యాపారి ఫిర్యాదు చేశాడు. నిందితులను జతిన్ పవార్​, శుభమ్ వర్మగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ నల్సపరాకు చెందినవారని తెలిపారు.

ప్రభుత్వ ఈ-పోర్టల్​లో పార్టనర్​షిప్ ఇప్పిస్తామని నమ్మించి వ్యాపారి గోపాని నుంచి నిందితులు మొదట రూ.లక్ష వసూలు చేశారు. అనంతరం విడతలవారీగా మొత్తం రూ.1.31 కోట్లు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 25న నిందితులు ఈ-పోర్టల్ ఫ్రాంచైజీ కోసం లైసెన్స్, పర్మిట్, ఇతర రుసుములకు సంబంధించిన పేమెంట్​ స్లిప్‌ను గోపానికి ఇచ్చారు. ఈ పేమెంట్ రసీదులు.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ జారీ చేసిందని వ్యాపారితో తెలిపారు. అయితే ఈ రసీదులో సీఎం ఏక్​నాథ్ శిందే సంతకం ఇంగ్లీష్​లో ఉంది. సీఎం సంతకంపై అనుమానం వచ్చిన గోపాని.. వాలివ్ పోలీసులను అశ్రయించాడు. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి: గుజరాత్​లో కేజ్రీవాల్​కు చేదు అనుభవం.. వాటర్​ బాటిల్​తో దాడి!

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి చిన్నారి మృతి.. ఛార్జింగ్​ అవుతుండగానే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.