ETV Bharat / bharat

రూ.21కోట్ల యురేనియం స్వాధీనం- ఇద్దరు రిమాండ్​ - యురేనియం

రూ.21కోట్ల విలువైన యురేనియాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) అరెస్టు చేసింది. వారిని ఏటీఎస్.. కోర్టు ముందు హాజరుపరచగా మే12వరకు న్యాయస్థానం రిమాండ్​ విధించింది.

Uranium
యురేనియం
author img

By

Published : May 6, 2021, 4:24 PM IST

అక్రమంగా తరలిస్తున్న రూ.21.30కోట్ల విలువైన 7 కిలోల యురేనియాన్ని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జిగర్ పాండ్యా అనే నిందితున్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఫిబ్రవరి14న యురేనియాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా.. పక్కా సమాచారంలో ఏటీఎస్ దాడి చేసింది. ఈ క్రమంలో జిగర్ పాండ్యాను ఏటీఎస్​ అదికారులు విచారించగా.. అబు తాహిర్ అఫ్జల్ హుస్సేన్ ఛౌదరి అనే వ్యక్తి తనకు ఈ యురేనియాన్ని ఇచ్చాడని తెలిపాడు.

దీంతో ఛౌదరిని ఏటీఎస్ అరెస్టు చేసింది. హుస్సేన్ నుంచి 7.1కిలోల యురేనియాన్ని స్వాధీనం చేసుకుంది.

తాజాగ ఇద్దరు నిందితులను ఏటీఎస్.. కోర్టు ముందు హాజరు పరచగా మే12వరకు న్యాయస్థానం రిమాండ్​ విధించింది.

ఇదీ చదవండి: బంగాల్ హింసపై గవర్నర్​ను నివేదిక కోరిన హోంశాఖ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.