ETV Bharat / bharat

పుల్వామా ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు లొంగుబాటు - పుల్వామా కాల్పుల్లో ఇద్దరు ముష్కరుల లొంగుబాటు

పుల్వామా ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు భారత సైన్యం ముందు లొంగిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఆ ఇద్దరూ స్థానికులుగా గుర్తించారు.

పుల్వామా ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరుల లొంగుబాటు
author img

By

Published : Jan 30, 2021, 11:45 AM IST

Updated : Jan 31, 2021, 4:48 AM IST

జమ్ముకశ్మీర్​లో పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు లొంగిపోయినట్టు అధికారులు తెలిపారు.

కాకాపొరా జిల్లాలోని లెల్హార్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలుత.. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ నేపథ్యంలో కాల్పులు ప్రారంభించారు ముష్కరులు. ప్రతిఘటించిన భారత్​.. వారిని దీటుగా ఎదుర్కొంది. ముగ్గురుని మట్టుబెట్టింది సైన్యం. ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఏకే రైఫిల్స్​తో పాటు సైన్యం ఎదుట లొంగిపోయారని అధికారులు వెల్లడించారు.

ఆ ఇరువురినీ అకీల్​ అహ్మద్ లోనే​​, రౌఫ్​ ఉల్​ ఇస్లామ్​గా గుర్తించారు. ఎన్​కౌంటర్​లో గాయపడిన అకీల్​ను స్థానిక సైనిక ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'దిల్లీ' పేలుడులో ఇరాన్​ హస్తం!

Last Updated : Jan 31, 2021, 4:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.