జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో లష్కరే తోయిబా చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను తుక్సన్ గ్రామస్థులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇటీవల జరిగిన పేలుళ్లలో ముఖ్య సూత్రదారి అయిన తాలిబ్ హుస్సేన్, దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఫైజల్ అహ్మద్‌ను గ్రామస్థులు నిర్బంధించారు. వారి నుంచి రెండు తుపాకులు, ఏడు గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![two let militants arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15723541_71_15723541_1656829387594.png)
![two let militants arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/jk-jam-militant-arrested-dry-7204390_03072022104713_0307f_1656825433_428.jpg)
గ్రామస్థుల ధైర్యసాహాసాలను మెచ్చిన కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) దిల్బాగ్ సింగ్ రూ.2 లక్షలను నజరానాగా ప్రకటించారు. మరోవైపు, ఇద్దరు ముష్కరులను పట్టుకున్న తుక్సన్ గ్రామస్థులకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
![two let militants arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15723541_kjfjdf.jpg)
ఇవీ చదవండి: దటీజ్ ఆర్మీ... 4గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం.. అమర్నాథ్ యాత్రికులకు రిలీఫ్!
భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్.. నగ్న వీడియోలు తీసి..