ETV Bharat / bharat

ఒంటి కాలితో 2లక్షల కి.మీ సైక్లింగ్.. క్యాన్సర్​ను, వైకల్యాన్ని ఎదిరించిన రాజు - క్యాన్సర్​తో సైక్లింగ్​ చేసిన వ్యక్తి

రెండు లక్షల కిలోమీటర్లు ఒంటి కాలితో సైకిల్​ తొక్కి అరుదైన ఘనత సాధించారు మహారాష్ట్రకు చెందిన డాక్టర్​ రాజు తురకానే. ఆయన ప్రయాణం వెనుక ఓ స్ఫూర్తిదాయకమైన కథ ఉంది. అదేంటో మీరే చూడండి.

Two Lakh Kilometer Cycle Journey On One Leg

author img

By

Published : Nov 17, 2022, 7:35 PM IST

Updated : Nov 17, 2022, 11:02 PM IST

క్యాన్సర్​తో 2 లక్షల కిలో మీటర్ల సైక్లింగ్ చేసిన రాజు

క్యాన్సర్​.. ఆయన జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఒక కాలును కోల్పోయి, దివ్యాంగుడిగా మారేందుకు కారణమైంది. ఇప్పుడు రెండో కాలుకూ అదే సమస్య. అయినా.. ఆయన అధైర్యపడలేదు. సంకల్ప బలాన్ని, సైకిల్​ను ఆయుధంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. వందలు కాదు, వేలు కాదు.. ఏకంగా రెండు లక్షల కిలోమీటర్లు ఒంటి కాలితో సైక్లింగ్​ చేసి విధిరాతను ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే.. డాక్టర్​ రాజు తురకానే.

Two Lakh Kilometer Cycle Journey On One Leg
సైక్లింగ్ చేస్తున్న రాజు

రాజుది మహారాష్ట్రలోని అమరావతి. 2007లో డెంటల్​ మెడిసిన్​లో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశారు. ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్​ డిగ్రీ సంపాదించారు. అయితే.. కొన్నేళ్ల క్రితం ఆయనకు క్యాన్సర్​ ఉన్నట్లు తేలింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. క్యాన్సర్ కారణంగా ఒక కాలును తొలగించాల్సి వచ్చింది. అయినా.. ఏమాత్రం అధైర్యపడకుండా ఉక్కు సంకల్పంతో ముందుకు సాగారు రాజు. ఒంటి కాలితోనే సైకిల్ తొక్కడం సాధన చేశారు. దిల్లీ-ముంబయి, ముంబయి-పుణె, ముంబయి-నాగ్​పుర్​ సహా మరెన్నో యాత్రల్ని సైకిల్​పైనే పూర్తి చేశారు. ఇప్పటివరకు ఆయన దాదాపు రెండు లక్షల కిలోమీటర్లు ఒంటి కాలితో సైక్లింగ్​ చేసి.. రికార్డు సృష్టించారు. ఇప్పుడు రాజు రెండో కాలుకూ క్యాన్సర్ వ్యాపించింది. అయినా.. ఇలానే పోరాడి వ్యాధిని జయిస్తానని, సైక్లింగ్ కొనసాగిస్తానని ధీమాగా చెబుతున్నారు రాజు.

సాహిత్యం పట్ల రాజుకు ఆసక్తి ఎక్కువ. అందుకే ఆయన నాటకాలు రాయడంపై దృష్టిపెట్టారు. పుణెలోని ప్రఖ్యాత ఫిల్మ్​ అండ్ టెలివిజన్ ఇన్​స్టిట్యూట్​లో సినిమా టెక్నాలజీ కోర్సు పూర్తి చేశారు. ఫెయిల్యూర్​ లవ్ స్టోరీ, సైక్లింగ్ కీడా అనే పుస్తకాలు రాశారు.

సైకిళ్లతో రాజు

ఇవీ చదవండి : శ్రద్ధ హత్య కేసు నిందితుడికి నార్కో టెస్ట్.. మరో ఐదు రోజులు పోలీస్​ కస్టడీ

యువతి ముఖంపై మద్యం సీసాతో దాడి.. తనకు దక్కంది ఎవరికీ దక్కకూడదని..

Last Updated : Nov 17, 2022, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.