కర్ణాటక దొడ్డబల్లాపురలో విషాద ఘటన చోటుచేసుకుంది(karnataka accident news). 60మంది ప్రయాణికులున్న ఓ పెళ్లి బస్సు సుబ్రమణ్య ఘాట్ వద్ద అదుపుతప్పి లోయలో పడింది(karnataka bus accident news). ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 27మంది గాయపడ్డారు.
![wedding bus falls into a ditch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bng-01-accident-pkg-ka10057_24102021110452_2410f_1635053692_775_2410newsroom_1635060340_623.jpg)
సుబ్రహ్మణ్య ఆలయంలో శనివారం వివాహ వేడుకలు జరిగాయి. గౌరిబిడనూర్ తాలుకాకు చెందిన ప్రజలు బస్సులో ఆ వివాహానికి తరలివెళ్లారు. తిరిగివస్తున్న క్రమంలో 10గంటల ప్రాంతంలో 30అడుగుల లోయలో పడిపోయింది.
ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతులను మకాలి గ్రామానికి చెందిన శివకుమార్, బండిచిక్కనహల్లివాసి రామకృష్ణా రెడ్డిగా గుర్తించారు.
క్షతగాత్రులను దొడ్డబల్లాపుర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
![wedding bus falls into a ditch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bng-01-accident-pkg-ka10057_24102021110452_2410f_1635053692_476_2410newsroom_1635060340_666.jpg)
కారణం ఏంటి?
బస్సు నడిపిన వ్యక్తి వధూవరుల బంధువని తెలుస్తోంది. మద్యం సేవించి అతడు వాహనం నడిపినట్టు సమాచారం. 10గంటల సమయంలో భారీ వర్షం కూడా కురిసింది. ఎదురుగా రోడ్డు కనపడకపోవడం వల్లే బస్సు లోయలో పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి:- పెళ్లైన మూడు నెలలకే భార్యను అమ్మేసిన భర్త!