ETV Bharat / bharat

వాలెంటైన్స్ డే తర్వాతి రోజు మిస్సింగ్.. అనుమానాస్పద రీతిలో బావిలో.. - బావిలో లభ్యమైన ప్రేమికుల మృతదేహాలు న్యూస్

అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన ఇద్దరి వ్యక్తులు అనుమానాస్పద రీతిలో ఓ బావిలో మృతదేహాలై తేలారు. మహారాష్ట్ర లాతూర్​ సమీపంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

two dead bodies in a well in suspicious manner
అనుమానాస్పద రీతిలో బావిలో ఇద్దరి మృతదేహాలు
author img

By

Published : Feb 19, 2023, 3:23 PM IST

మహారాష్ట్ర లాతూర్​ జిల్లాలో.. ఇటీవల కనిపించకుండా పోయిన ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలు అనుమానాస్పద రీతిలో ఓ బావిలో లభ్యమయ్యాయి. పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లాతూర్​, బార్షి రోడ్​లోని వాస్వాడి ప్రాంతంలో దివ్య దత్తా బన్సోడే(15) అనే బాలిక నివసిస్తోంది. ఆమె ఇంటికి పక్కనే విజయ్ వసంత్ ఆదమానె(21) అనే యువకుడు నివసిస్తున్నారు. వీరిద్దరూ ఫిబ్రవరి 15 నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లారో తెలియక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ మిస్సింగ్​పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే శుక్రవారం చించోలి బల్లాల్​నాథ్​లోని శివారులోని ఓ బావిలో దివ్య మృతదేహం కనిపించింది. నీటిపై తేలుతూ ఉన్న మృతదేహాన్ని చూసి కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బావి పక్కనే యువకుడి చెప్పులు కూడా కనిపించాయి. యువకుడి మృతదేహం కూడా బావిలోనే ఉండవచ్చని స్థానికులలో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో గేట్​గావ్​ పోలీస్​ స్టేషన్​కు చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్​స్పెక్టర్​ అశోక్​ ఘర్గే నేతృత్వంలో.. యువకుడి డెడ్​బాడీ కోసం గాలించారు. చివరకు శనివారం బావిలో యువకుడి మృతదేహం కూడా లభ్యమయింది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం డెడ్​బాడీలను ఇరు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

దీంతో బాలిక, యువకుడు ఇద్దరూ ప్రేమించుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులలో ఊహాగానాలు మొదలయ్యాయి. మృతి చెందిన విజయ్, దివ్యల బంధువులు పోలీసులతో ఈ విషయం గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో గేట్​గావ్​ పోలీసులు ఈ ఘటనపై హఠాన్మరణం కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 14న 'వాలెంటైన్స్ డే' జరుపుకున్న ఈ జంట మరుసటి రోజు సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.