ETV Bharat / bharat

జవాన్ల మధ్య భీకర కాల్పులు- ఇద్దరు మృతి - కాల్పులు

బీఎస్​ఎఫ్​ సిబ్బంది మధ్య జరిగిన కాల్పులు ఇద్దరు జవాన్ల మృతికి దారితీశాయి. ఈ ఘటనలో మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు.

BSF jawans killed
సరిహద్దు భద్రతా దళం
author img

By

Published : Sep 24, 2021, 11:24 AM IST

Updated : Sep 24, 2021, 11:59 AM IST

సరిహద్ద భద్రతా దళం (బీఎస్​ఎఫ్) సిబ్బంది మధ్యలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన త్రిపుర గోమతి జిల్లాలోని సిలాచారి ప్రాంతం ఇండో-బంగ్లా సరిహద్దు వద్ద జరిగింది.

ఇదీ జరిగింది..

సరిహద్దు గస్తీలో ఉన్న 20వ బెటాలియన్​కు చెందిన కానిస్టేబుల్​ ప్రతాప్​ సింగ్, హవీల్దార్​ సత్బీర్​ సింగ్ మధ్య గురువారం సాయంత్రం వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన ప్రతాప్​.. సత్బీర్​పై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

BSF jawans killed
చనిపోయిన జవాన్

ఆ తర్వాత క్యాంపునకు తిరిగివచ్చిన ప్రతాప్​.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతడి అనూహ్య చర్యతో కంగుతిన్న పై అధికారి రామ్​కుమార్ సింగ్.. మాటలతో సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ, ఆయనకు బుల్లెట్లతో బదులు చెప్పాడు ప్రతాప్.

ఈ ఘటనతో భయపడిపోయిన ఇతర సిబ్బంది తమపైకి కూడా కాల్పులకు తెగబడతాడనే భయంతో ప్రతాప్​ను కాల్చి చంపేశారు. రామ్​కుమార్​ను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఉన్నత అధికారులు మృతదేహాలను శవపరీక్షకు తరలించారు.

ఇదీ చూడండి: డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇక ఆ ఆయుధాలు!

Last Updated : Sep 24, 2021, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.