ETV Bharat / bharat

ఏటీఎం హ్యాకింగ్​కు యత్నం.. అడ్డుకున్న స్థానికులు - ఏటీఎంకు హ్యక్​

ఏటీఎంకు చిప్​ అమర్చి హ్యాక్​ చేయబోయిన నిందితుల్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. జనవరి నుంచి ఇప్పటివరకు మంగుళూరులో చాలా ఏటిఎం దొంగతనాలు జరిగాయి.

ATM hackers
ఏటీఎంకు హ్యక్​ చేయబోయిన వ్యక్తుల్ని అడ్డుకున్న స్థానికులు
author img

By

Published : Feb 24, 2021, 11:20 AM IST

ఏటీఎంకు హ్యక్​ చేయబోయిన వ్యక్తుల్ని అడ్డుకున్న స్థానికులు

ఏటీఎం యంత్రానికి చిప్​ అమర్చి హ్యాక్​ చేయబోయిన నిందితుల్ని స్థానికులు అడ్డుకున్నారు. కర్ణాటకలోని మంగుళూరులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.

మంగళూరులోని మంగళదేవి ప్రాంతంలో ఉన్న ఏటీఎంని హ్యక్​ చేయడానికి ముగ్గురు వ్యక్తుల వెళ్లారు. ఏటీఎంకు ఏదో చిప్​ను అమర్చుతుండగా అక్కడున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. దాంతో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. స్థానికులు వారిని వెంబడించి..ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు.

అయితే ఐదు లేదా ఆరుగురు సభ్యుల ముఠా ఏటీఎం హ్యాకింగ్​కు యత్నించారని పోలీసులు తెలిపారు. దాదాపు 40 ఏటీఎం హ్యాకింగ్​ కేసుల్లో వారు నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు.

ఏటీఎం దొంగతనానికి సంబంధించి జనవరి నుంచి ఇప్పటి వరకు మంగళూరు పోలీసు స్టేషన్​లో చాలా కేసులు నమోదయ్యాయి. హ్యాకింగ్​ ద్వారా తమ ఖాతాలో డబ్బు చోరీకి గురైందని చాలా మంది ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: కాలిన గాయాలతో.. రోడ్డు పక్కన నగ్నంగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.