ETV Bharat / bharat

రెండున్నరేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. భార్య కంప్లైంట్​తో.. - మహిళపై ముగ్గురు గ్యాంగ్​ రేప్​ బిహార్

రెండున్నరేళ్ల కుమార్తెపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని.. అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఘటన దిల్లీలో జరిగింది. బిహార్​లో జరిగిన మరో ఘటనలో ఓ వివాహితపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

daughter raped by her father in delhi
daughter raped by her father in delhi
author img

By

Published : Jul 24, 2023, 3:12 PM IST

దేశ రాజధాని దిల్లీలో రెండున్నరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది తన భర్తే అని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మంగోల్​పురి పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లి తన కుటుంబంతో గాజియాబాద్​లోని లోనీ ప్రాంతంలో నివసిస్తోంది. ఈ ఏడాది జనవరి 4న ఆమె ఓ పని నిమిత్తం మార్కెట్​కు వెళ్లింది. ఈ సమయంలో చిన్నారిపై ఆమె తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక తల్లి ఇంటికి తిరిగివచ్చే సరికి.. తన భర్త చిన్నారికి దుస్తులు వేస్తూ కనిపించాడు. కొద్దిసేపటి తర్వాత చిన్నారి జననాంగాల నుంచి రక్తస్రావం అయింది. అయితే, ఈ విషయం పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని అత్తమామలు బాలిక తల్లిని బెదిరించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

అయితే, చిన్నారి తల్లి జులైలో తన పుట్టింటికి వచ్చింది. అనంతరం ఓ సామాజిక కార్యకర్త ద్వారా మంగోల్​పురి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. పోక్సో చట్టంతో పాటు తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ముగిసిన తర్వాతే అసలు విషయం బయటపడుతుందని తెలిపారు. అయితే ఈ కేసును లోనీ పోలీస్​ స్టేషన్​కు బదిలీ చేసినట్లు వెల్లడించారు. అక్కడి పోలీసులే విచారణ జరుపుతారని తెలిపారు.

వివాహితపై సామూహిక అత్యాచారం..
బిహార్​లోని అర్​రియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక హత్యచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆమె భర్తను ఓ కర్రకు కట్టేసి కొట్టారు. ఘటనాస్థలంలో ఒక నిందితుడిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నర్పత్‌గంజ్ పోలీస్​స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 32 ఏళ్ల ఓ మహిళ నివసిస్తోంది. శనివారం రాత్రి భోజనం చేసి కుటుంబంతో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ కేకలు విని అక్కడికి చేరుకున్న భర్తను ఓ కర్రకు కట్టేసి కొట్టారు. ఘటనాస్థలిలో స్థానికులు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని జైలుకు తరలించారు.

కాశీ హిందూ వర్సిటీలో విద్యార్థినిపై అత్యాచారయత్నం..
కాశీ హిందు విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. సైబర్​ లైబ్రరీలో చదువుకుంటుండగా.. ఓ విద్యార్థి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడు దూషించాడని, చేతులు పట్టుకుని లైబ్రరీ నుంచి బయటకు తోసేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తర్వాత తాను మానసికంగా బాధపడ్డానని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని విద్యార్థిని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.