ETV Bharat / bharat

ట్విట్టర్​కు మరో షాక్- దిల్లీలో కేసు నమోదు - ట్విట్టర్ దిల్లీ కేసు

ట్విట్టర్​పై దిల్లీలో కేసు నమోదైంది. ఓ దర్యాప్తు విషయంలో తప్పుదోవ పట్టించడం సహా పోక్సో చట్టాన్ని ఉల్లంఘించినందుకు జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ ఫిర్యాదు చేసింది. అదే సమయంలో చిన్నారులు ట్విట్టర్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాసింది.

NCPCR files complaint against Twitter
ట్విట్టర్​కు మరో షాక్- దిల్లీలో కేసు నమోదు
author img

By

Published : May 31, 2021, 5:22 PM IST

మైక్రోబ్లాగింగ్ వెబ్​సైట్ ట్విట్టర్​పై దిల్లీలో కేసు నమోదైంది. తప్పుడు సమాచారం అందించడం సహా పోక్సో చట్టాన్ని ఉల్లంఘించినందుకు జాతీయ బాలల హక్కుల కమిషన్​ ఈ ఫిర్యాదు చేసింది. ఓ దర్యాప్తు విషయంలో కమిషన్​ను తప్పుదోవ పట్టించినట్లు పిటిషన్​లో పేర్కొంది.

పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 15, 19ని ట్విట్టర్ సంస్థ ఉల్లంఘించిందని కమిషన్ ఆరోపించింది. ఐపీసీ సెక్షన్ 199ని సైతం ఉల్లంఘించిందని పేర్కొంది.

మరోవైపు, చిన్నారులు ట్విట్టర్ వినియోగించకుండా నిరోధించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగూ తెలిపారు. పిల్లలకు ట్విట్టర్ సురక్షితం కాదని అన్నారు.

ఇదీ చదవండి- New IT Rules: ట్విట్టర్​కు హైకోర్టు షాక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.